Share News

సుపరిపాలనతో గ్రామాలను అభివృద్ధి చేస్తాం

ABN , Publish Date - Jul 18 , 2025 | 01:19 AM

సు పరిపాలనతో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని గిద్దలూరు ఎమెల్యే ముత్తుము ల అశోక్‌రెడ్డి అన్నారు. మండలంలోని కా ల్వపల్లి, చిన్నగానిపల్లి గ్రామాల్లో గురువా రం ఆయన సుపరిపాలనలో తొలి అడు గు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

సుపరిపాలనతో గ్రామాలను అభివృద్ధి చేస్తాం
కర పత్రాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డి

రాచర్ల, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : సు పరిపాలనతో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని గిద్దలూరు ఎమెల్యే ముత్తుము ల అశోక్‌రెడ్డి అన్నారు. మండలంలోని కా ల్వపల్లి, చిన్నగానిపల్లి గ్రామాల్లో గురువా రం ఆయన సుపరిపాలనలో తొలి అడు గు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సం దర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ హామీల దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు

వెళుతుందన్నారు. ఇప్పటికే పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, ఏడాదికి మూడు సిలిండర్లు అమలు చేశామని, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఈ ఏడాదిలోనే ఆడబిడ్డ నిధి కింద 18ఏళ్లు దాటి 60ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగులకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు చెప్పారు. అధికారం కోల్పోవడంతో జగన్‌రెడ్డికి పిచ్చి పట్టి యాత్ర పేరుతో రోడ్డెక్కి

రా ద్ధాంతం చేస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో ఏమీ చేయలేని వారు. ప్రజా ప్రభుత్వం పనులు చేస్తుంటే బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజలు ఇది గమనించాలన్నారు. ప్రతి గృహానికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్న ఆయన పరిష్కారం చూపుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రోడ్డుకు రూ.2.80కోట్ల నిధులు మంజూరు

పనులు ప్రారంభించిన ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : ప్రయాణికుల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లను నిర్మిస్తున్నామని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. రూ.2.80కోట్ల నిధులు మంజూరైన ఎర్రగొండపాలెం-పుల్లలచెరువు ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఎర్రగొండపాలెంలో 1 కి.మీ వద్ద ఎరిక్షన్‌బాబు భూమి పూజ చేసి, తారు రోడ్డు నిర్మాణ పనులను గు రువారం ప్రారంభించారు. గ్రామాలు, పట్టణాల్లో రోడ్లను అభివృద్ధి చేస్తామ ని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాదిలోనే

నిధులు మంజూరు చే యించి రోడ్లను నిర్మిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, పుల్లలచెరువు మండల అధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్‌, టీడీపీ ముఖ్యనాయకులు శనగా నారాయణరెడ్డి, చిట్యాల వెంగళరెడ్డి, సుబ్బారావు, సుబ్రమణ్యం, సత్యనారాయణగౌడ్‌, మంత్రునాయక్‌, మహేష్‌, షేక్‌ మస్తాన్‌ వలి ఆర్‌అండ్‌బీ ఇంజనీర్‌లు పాల్గొన్నారు.

టీడీపీతోనే సంక్షేమ ఫలాలు

టీడీపీ పాలనలోనే అన్ని వర్గాలలో పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని ఎరిక్షన్‌బాబు అన్నారు. 24 బూత్‌ చైతన్యనగర్‌లో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు.

Updated Date - Jul 18 , 2025 | 01:19 AM