చెరువు కట్టపై రహదారిని నిర్మిస్తాం
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:08 PM
మార్కాపురం చెరువుకట్టపై నూతన రహదారిని త్వరలోనే నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. స్థానిక చెరువుకట్టను ఆదివారం ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఎమ్మెల్యే నారాయణరెడ్డి
మార్కాపురం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం చెరువుకట్టపై నూతన రహదారిని త్వరలోనే నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. స్థానిక చెరువుకట్టను ఆదివారం ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రభు త్వం ఇటీవలె కట్టపై నూతన రహదారి నిర్మాణానికి రూ.4కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అంచనాలు ఏ విధంగా రూపొందించారు, రహదారిని ఏ విధంగా నిర్మిస్తారు అనే అంశాలపై ఆర్‌అండ్‌బీ అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు. ప్రధానంగా స్థానిక రాజ య్య మటన్ షాప్ సమీపం నుంచి ఇం డస్ట్రియల్ ఎస్టేట్ వద్దగల అలుగు వరకు 2.5 కిలోమీటర్ల మేర ప్రస్తుతం ఉన్న రహదారి స్థానే నూతన రహదారి నిర్మా ణం చేపట్టన్నుట్లు ఈఈ పి.శ్రీనివాసరావు తెలిపారు. పనులు నాణ్యతతో జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మె ల్యే సూచించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఏఈ షేక్ షబ్బీర్, ఏఎంసీ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి పాల్గొన్నారు.