ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా!
ABN , Publish Date - Sep 14 , 2025 | 10:49 PM
ఉపాధ్యాయుల సమస్యలను దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి సహకరి స్తామని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సమస్యలను దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి సహకరి స్తామని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ఏపీటీ ఎఫ్ నిరసన వారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేను ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సంఘ నాయ కులు కలసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ ఏపీటీఎఫ్ వినతి మేరకు ఉపాధ్యాయుల సమస్యలను సీఎం చంద్రబాబు, విద్యాశాఖామంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి ప్రత్యేక చొరవ వహిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా కార్య దర్శి నాయబ్‌రసూల్, పి.రాజ్‌కుమార్, కె. రామ్మోహన్, ఒంగోలు వెంకటేశ్వర్లు, తోట శ్రీనివాసులు, ఆనంద్‌బాబు, హజరత్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సుబ్బారాయుడు, కేవీ సుబ్బ య్య, నజీర్‌బాషా, రాములు, గోపాలకృష్ణ, మచ్చా ప్రసాద్, పాకల శ్రీనివాసులు, సాల్మన్, పెన్నా వెంకటేశ్వర్లు, హుస్సేన్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.