ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుంటాం
ABN , Publish Date - Oct 30 , 2025 | 11:40 PM
ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము ముందుండి వారి సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 17వ వార్డు సారంగపాణి వీధికి చెందిన పునరావాస బాధితులకు ఆయన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
ముంపుప్రాంత ప్రజలకు నిత్యవసర సరుకుల పంపిణీ
గిద్దలూరు టౌన్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము ముందుండి వారి సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 17వ వార్డు సారంగపాణి వీధికి చెందిన పునరావాస బాధితులకు ఆయన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 25కిలోల బియ్యం, కిలో చక్కెర, కిలో కందిపప్పు, కిలో ఉల్లిపాయలు, వంటనూనె, కిలో బంగాళదుంపలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మొంథా తుఫాన్ ప్రభావంతో చెరువులు, వాగులు, వరదలతో నిండాయన్నారు. పట్టణంలోని ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు. పునరావాస కేంద్రంలోని బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000 అందచేస్తున్నామన్నారు. అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తుఫాన్‌తో ప్రాణ, ఆస్తి నష్టాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారన్నారు. అధికార యంత్రాంగం బాగా పని చేశారని, వారందరినీ అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఈవీ రమణబాబు, తహసీల్దార్ ఆంజనేయరెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ రామనారాయణరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు శానేషావలి, టీడీపీ నాయకులు పిడతల రవితేజ, బొంతా లక్ష్మీదేవి, దూదేకుల దస్తగిరి, మద్దులేటి, బొర్రా రాఘవేంద్రయాదవ్, దూదేకుల ఫాతిమా పాల్గొన్నారు.
వరద బాధితులకు అండగా ఉంటాం - ఎమ్మెల్యే కందుల
మార్కాపురం రూరల్, అక్టోబరు30 (ఆంధ్రజ్యోతి) : మొంఽథా తుఫాన్ వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంద ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. మండలంలోని పెద్దనాగులవరం, భూపతిపల్లి పునరావాసా శిబిరాల్లో ఉన్న వరద బాధితులను గురువారం ఎమ్మెల్యే కందుల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతుతూ ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరై అధైర్యపడవద్దని కందుల భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ చిరంజీవి, సొసైటీ చైర్మన్ రామాంజులరెడ్డి, కొత్తపల్లి సర్పంచ్ వెంకటేశ్వర్లు, అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.