టీడీపీ పటిష్టతకు కృషిచేయాలి
ABN , Publish Date - Nov 06 , 2025 | 10:26 PM
టీడీపీ పటిష్టతకు కృషిచేయాలని ఎమ్మె ల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం సీఎస్‌పురం మండల కేంద్రంలో నూ తనంగా నిర్మించిన టీడీపీ మండల కార్యాలయా న్ని ఆయన ప్రారంభించారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
సీఎస్‌పురం(పామూరు), నవంబరు 6(ఆంధ్ర జ్యోతి): టీడీపీ పటిష్టతకు కృషిచేయాలని ఎమ్మె ల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం సీఎస్‌పురం మండల కేంద్రంలో నూ తనంగా నిర్మించిన టీడీపీ మండల కార్యాలయా న్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా జరి గిన సమావేశంలో డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ సీఎస్‌పురం మండలంలో టీడీపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలన్నారు. సీఎస్ పురంలో రూ.3 కోట్లతో సీసీ రోడ్డు నిర్మించినట్టు చెప్పా రు. గ్రామంలో అన్ని ప్రధాన రోడ్లును సీసీ రోడ్డుగా, బస్టాండ్ సెంటర్‌ను ఆధునీకరించినట్లు తెలిపారు. మండలాన్ని అన్నివిధాలుగా అభివృద్ది చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎమైనా ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వెంట నే వాటి పరిష్కరానికి కృషి చేస్తానని చెప్పారు. బడు గు, బలహీన వర్గాల అభ్యున్నతికి పార్టీ కట్టుబడి ఉం దన్నారు. కూటమి ప్రభుత్వం పేదల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు పరుస్తుందన్నారు. ప్రతి ఇంటికి అభివృ ద్ధి, సంక్షేమ ఫలాలు అందేలా కార్యకర్త లు పనిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో సీఎస్‌పురం, పామూ రు టీడీపీ మండల అధ్యక్షులు బొబ్బూ రి రాజేష్, బొల్లా నరసింహారావు, బి. వెంగయ్య, సీహెచ్ వెంకట్‌రెడ్డి, ఎం.శ్రీని వాసులు, ఎన్‌సీ మాలకొండయ్య, బో యిళ్ల నారాయణరెడ్డి, సర్పంచ్ శ్రీరాం పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.
టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు
వెలిగండ్ల, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పలువురు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసిం హారెడ్డి అన్నారు. మండలంలోని రాళ్ళపల్లి పం చాయతీలోని పూలికుంట్ల గ్రామానికి చెందిన 22 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరారు. గురువారం కనిగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన ఒకటిన్నర సంవత్సరకాలంలోనే నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రజలకు ఆవ సరమైన పనులు చేశామన్నారు. అందుకు గన్నవరం, గోకులం బ్రిడ్జిలు నిర్మాణాలని తెలిపారు.
టీడీపీలో చేరినవారిలో మర్రి నారయణ, రోశయ్య, పెద్ద రాజు, గురుస్వామి, లంగిరేకుల బాలయ్య, వెంకట లక్ష్మమ్మ, గురవ్య, మల్లికార్జున, భాగ్యలక్ష్మి, కొండమ్మ, నాగేంద్ర, వెంకటరమణ, గురుభవాని, తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశి రెడ్డి, టీడీపీ నాయకులు దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, కేలం ఇంద్ర భూపాల్ రెడ్డి, ముత్తిరెడ్డి వెంకట రెడ్డి, తదితరులు ఉన్నారు.