టీడీపీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి
ABN , Publish Date - Nov 30 , 2025 | 10:31 PM
టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమి ష్టిగా కృషిచేయాలని రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక కమిషన్ చైర్‌పర్సన్ పొడపాటి తేజస్విని అన్నారు. ఆదివారం మండలంలోని కొర్లమడుగు, చిన్నఉయ్యావా డ గ్రామాల్లో ఆమె పర్యటించారు.
దర్శి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమి ష్టిగా కృషిచేయాలని రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక కమిషన్ చైర్‌పర్సన్ పొడపాటి తేజస్విని అన్నారు. ఆదివారం మండలంలోని కొర్లమడుగు, చిన్నఉయ్యావా డ గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈసందర్భంగా స్థాని క టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రజాప్రభుత్వం అమ లుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తేజస్విని మా ట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు గొర్రె సుబ్బారెడ్డి, క్లష్టర్ ఇన్‌చార్జ్ రూపినేని రామారావు, నాయకులు గుర్రం బాలకృష్ణ, చిన్నపురెడ్డి వీరనాగిరెడ్డి, అంబటి గోవిందరెడ్డి, రూపినేని వెంకటరావు, చీదర్ల రమణయ్య, చేతల అయ్యప్ప, రావి కొండలు, కె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.