మహానాడుకు తరలిరావాలి
ABN , Publish Date - May 24 , 2025 | 10:34 PM
కడపలో జరిగే మహానాడుకు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ కోరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ టీడీపీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
దర్శి, మే 24 (ఆంధ్రజ్యోతి) : కడపలో జరిగే మహానాడుకు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ కోరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ టీడీపీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ తిండి రాజే్‌షను డాక్టర్ లలితసాగర్, మాజీ ఎమ్మెల్యే పాపారావు తదితరులు సన్మానించారు. ఈ సందర్భంగా లలిత్‌సాగర్ మాట్లాడుతూ ఈనెల 27, 28, 29 తేదీల్లో కడపలో ఘనంగా నిర్వహిస్తున్న మహానాడును విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణిసుబ్బారావు, టీడీపీ పట్టణాధ్యక్షుడు పుల్లలచెరువు చిన్న, దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల టీడీపీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, మోడి ఆంజనేయులు, పిడతల నెమలయ్య, మేడగం వెంకటేశ్వరరెడ్డి, కూరపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.