తుఫాను బాధితులను ఆదుకోవాలి
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:42 AM
ఇటీవల కురిసిన మొంథా తుఫాన్ కారణంగా ఒంగోలు నియోజకవర్గ పరిధిలో వివిధ శాఖలలో మొత్తం రూ. 92 కోట్లు నష్టం వాటిల్లిందని, బాధితులను ఆదుకుని నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కేంద్ర బృందాన్ని కోరారు. సోమవారం ఒంగోలు విచ్చేసిన కేంద్ర బృందాన్ని కొత్తపట్నం మండలం చింతల వద్ద ఎమ్మెల్యే దామచర్ల కలిసి నష్టం వివరాలను తెలియజేశారు
- కేంద్ర బృందానికి ఎమ్మెల్యే దామచర్ల వినతి
ఒంగోలు కార్పొరేషన్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : ఇటీవల కురిసిన మొంథా తుఫాన్ కారణంగా ఒంగోలు నియోజకవర్గ పరిధిలో వివిధ శాఖలలో మొత్తం రూ. 92 కోట్లు నష్టం వాటిల్లిందని, బాధితులను ఆదుకుని నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కేంద్ర బృందాన్ని కోరారు. సోమవారం ఒంగోలు విచ్చేసిన కేంద్ర బృందాన్ని కొత్తపట్నం మండలం చింతల వద్ద ఎమ్మెల్యే దామచర్ల కలిసి నష్టం వివరాలను తెలియజేశారు. ఆక్వా సెక్టార్‌కు సంబంధించి రొయ్యలు, చేపలు చెరువుల సాగులో 312 హెక్టార్లలో రూ. 19.94 కోట్లు నష్టం వాటిల్లగా, ఒంగోలు నగర పరిధిలోని డ్రైన్‌లు, సీసీ రోడ్‌లు, కల్వర్టులు దెబ్బతిన్నాయని, వాటి నష్టం విలువ రూ. 19.91 కోట్లు ఉందని వివరించారు. అలాగే ఒంగోలు అర్బన్, రూరల్ పరిధిలో తుఫాన్ కారణంగా పంట నీట మునిగి, రైతులు నష్టపోయారని, 850 ఎకరాలలో రూ. 81.41 లక్షలు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అలాగే ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని రోడ్డు దెబ్బతిని రూ. 47.99 కోట్లు, ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఒంగోలు రూరల్ పరిధిలోరూ. 2.97 కోట్లు నష్టం వాటిల్లినట్లుకేంద్ర బృందానికి ఐదు నివేదికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, జేసీ గోపాలకృష్ణ, ఒడా చైర్మన్ షేక్ రియాజ్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.