Share News

పోలియోరహిత సమాజానికి కృషిచేయాలి

ABN , Publish Date - Dec 21 , 2025 | 10:28 PM

పోలియో నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చుక్కల కార్యక్రమం నిర్వహిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వం బాలికల హైస్కూ ల్‌లో ఆదివారం చిన్నారులకు ఆయన చుక్కలు వేశారు.

పోలియోరహిత సమాజానికి కృషిచేయాలి
కనిగిరి: చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): పోలియో నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చుక్కల కార్యక్రమం నిర్వహిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వం బాలికల హైస్కూ ల్‌లో ఆదివారం చిన్నారులకు ఆయన చుక్కలు వేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రతిఒక్కరూ పోలియో రహిత సమాజానికి కృషి చేయాలన్నారు. అప్పుడే బిడ్డ నుంచి 5సంవత్సరాల చిన్నారుల వరకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు యారవ శ్రీను, డాక్టర్‌ ప్రియార్షనంద, ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 10:28 PM