Share News

ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలి

ABN , Publish Date - Dec 20 , 2025 | 01:40 AM

ఇదే స్పూర్తితో.. రెట్టించిన ఉత్సాహంతో మున్ముందు మరింతగా పనిచేయాలని పోలీసు అధికారులకు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్యచౌదరి హత్య కేసులో సాంకేతికతను ఉపయోగించి దర్యాప్తు చేసి, నిందితులను పసిగట్ట డంలో సమర్థవంతంగా పనిచేసినం దుకు పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.

ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలి
మంగళగిరిలో డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఎస్పీలు హర్షవర్ధన్‌రాజు, దామోదర్‌, ఇతర పోలీసు అధికారులు

మరింత బాధ్యతగా పనిచేయాలి

పోలీసు అధికారులకు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పిలుపు

వీరయ్యచౌదరి హత్యకేసు ఛేదనపై అభినందనలు

ఒంగోలు కార్పొరేషన్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ఇదే స్పూర్తితో.. రెట్టించిన ఉత్సాహంతో మున్ముందు మరింతగా పనిచేయాలని పోలీసు అధికారులకు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్యచౌదరి హత్య కేసులో సాంకేతికతను ఉపయోగించి దర్యాప్తు చేసి, నిందితులను పసిగట్ట డంలో సమర్థవంతంగా పనిచేసినం దుకు పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. శుక్రవారం మంగళ గిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యా లయంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో డీజీపీ హరీష్‌కు మార్‌ గుప్తా, గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి చేతులమీదుగా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, విజయనగరం ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మహిళా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ యు.సుధాకర్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ జగదీష్‌, డీటీసీ ఇన్‌స్పెక్టర్‌ వై.పాండురంగారావు, గతంలో చీమకుర్తి ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి ఎం.సుబ్బారావు, సోషల్‌ మీడియా ఇన్‌స్పెక్టర్‌ పనిచేసిన వి.సూర్యనారాయణ, ఎస్‌ఎన్‌పాడు ఎస్సై వి.అజయ్‌బాబులు అవార్డును అందుకున్నారు. పోలీసుల విధి నిర్వహణలో చూపిన ప్రతిభ ఆధారంగా ఏబీసీడీ అవార్డులను ప్రదానం చేశారు. జిల్లాకు ఉత్తమ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు మాట్లాడుతూ ఇలాంటి కేసులను సమర్థవంతంగా పరిష్కరించినప్పుడే ప్రజల్లో పోలీసు శాఖపై గౌరవం పెరుగుతుందన్నారు. ఈ అవార్డును స్ఫూర్తిగా తీసుకుని జిల్లా పోలీసులు భవిష్యత్‌లో కూడా మరిన్ని కేసులను సమష్టిగా ఛేదించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కీలక కేసుల దర్యాప్తులో అత్యంత ప్రతిభ కనబరచడాన్ని గుర్తించి ప్రతిష్టాత్మకంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రకటించే ఏబీసీడీ అవార్డుజిల్లాకు దక్కడం, అది కూడా డీజీపీ చేతులమీదుగా అందుకోవడం పట్ల జిల్లా పోలీసు శాఖ హర్షం వ్యక్తం చేసింది.

Updated Date - Dec 20 , 2025 | 01:40 AM