సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటాం
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:14 PM
ప్రత్యేక జిల్లా ప్రకటన చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటామని అన్నవరం గ్రామంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
పొదిలి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి ) : ప్రత్యేక జిల్లా ప్రకటన చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటామని అన్నవరం గ్రామంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సోమవారం మండల అధ్యక్షుడు దోర్నాల అంజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కకార్యక్రమంలో అంజిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలను సీఎం నెరవేర్చారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లా ఏర్పాటు అభినందనీయం
కొనకనమిట్ల, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయడం అభినందనీయమని టీడీపీ నాయకులు అన్నారు. శుక్రవారం మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు కృతజ్ఙతగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు మోరబోయిన బాబూరావు, కుందూరు కాశిరెడ్డి, మువ్వా కాటంరాజు పాల్గొన్నారు.