Share News

హామీలను అమలుచేస్తున్నాం

ABN , Publish Date - Aug 15 , 2025 | 11:58 PM

ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం సీఎం చంద్రబాబుకే సాధ్యమని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు.

హామీలను అమలుచేస్తున్నాం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం సీఎం చంద్రబాబుకే సాధ్యమని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక ఆర్టీసీ డిపోలో శుక్రవారం స్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈసంద ర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్‌సిక్స్‌ హామీల్లోని ఒక్కొక్కటిగా నెరవేర్చి ప్రజలకు మేలు చేకూరుస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. స్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడు కుందన్నారు. మహిళలకు ఉచితంగా ప్రయాణ వసతి కల్పించేందుకు ఆయ్యే భారాన్ని కూటమి ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని ఎమ్మెల్యే కోరారు. స్థానిక ఆర్టీసీ డిపో నుంచి విజయవాడ వెళ్ళే బస్సులో మహిళ లతో కలసి కొంతదూరం ప్రయాణించిన ఎమ్మెల్యే స్వయంగా తొలి టిక్కెట్‌ను టిమ్‌ మి షన్‌ ద్వారా మహిళలకు అందించారు. ప్రభుత ్వ నిబంధనల ప్రకారం నిర్వహించే ఉచిత బస్సు ప్రయాణం విజయవంతం కావాలంటే మహిళల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. జనసేన నాయకుడు వరికూటి నాగరాజు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరు స్తుందన్నారు. ఈ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం షయానబేగం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 11:58 PM