Share News

హామీలన్నీ అమలు చేస్తున్నాం

ABN , Publish Date - Jul 14 , 2025 | 11:19 PM

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందని ఎ మ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.

హామీలన్నీ అమలు చేస్తున్నాం
8వ వార్డులో కరపత్రాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కందుల

ఎమ్మెల్యే కందుల

మార్కాపురం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందని ఎ మ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. 8వవార్డులో సోమవారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్ర మం జరిగింది. ముందుగా ఎమ్మెల్యే కం దుల ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పం పిణీ చేసి ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాటలకు కట్టుబడి ము ఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. సంక్షేమంతోపాటు అభివృద్ధిపై కూడా నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. గత వైసీపీ ప్ర భుత్వం రూ.లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని లూటీ చేసిందన్నారు. ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకపోతోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున్‌, మాలపాటి వెంకటరెడ్డి, పఠాన్‌ ఇబ్రహీం, మౌళాలి, కౌన్సిలర్‌ భాగ్యలక్ష్మి, చిన్ననాగిరెడ్డి పాల్గొన్నారు.

పెద్దారవీడు : ముఖ్యమంత్రి చంద్రబా బు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేస్తోందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలో దేవరాజుగట్టు ఎస్సీ కాలనీలో సోమవారం సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దోచుకోవడమే తప్ప అభివృద్ధి అనే మాటే లేదన్నారు. నాడు గ్రామాలకు వెళ్లాలంటే నరకయాతన పరిస్థితి నుంచి నేడు సుఖంగా ప్రయాణించేలా రోడ్లను అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో సర్పంచి మెట్టు లక్ష్మీదేవి, టీడీపీ మండల అధ్యక్షుడు మెట్టు శ్రీనివాసుల రెడ్డి, మాజీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వరరావు, నాయకులు ఆనెకాళ్ల శ్రీనివాసుల రెడ్డి, ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు నక్కా శ్రీను, పాముల పోలురాజు, కోనంగి పాలంకయ్య, బూత్‌ ఇన్‌చార్జిలు, యూనిట్‌ ఇన్‌చార్జిలు క్లస్టర్‌ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 11:19 PM