Share News

అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

ABN , Publish Date - Apr 30 , 2025 | 10:36 PM

అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలో పలు కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కస్తూర్బా స్కూల్‌లోని జూనియర్‌ కళాశాలలో అదనపు తరగతులకు రూ.162.44 లక్షల నిధులు సమగ్ర శిక్షా అభియాన్‌ ద్వారా మంజూరు కాగా ఆభనవ నిర్మాణానికి అశోక్‌రెడ్డి భూమి పూజ చేశారు.

అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

బేస్తవారపేట, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి) : అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలో పలు కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కస్తూర్బా స్కూల్‌లోని జూనియర్‌ కళాశాలలో అదనపు తరగతులకు రూ.162.44 లక్షల నిధులు సమగ్ర శిక్షా అభియాన్‌ ద్వారా మంజూరు కాగా ఆభనవ నిర్మాణానికి అశోక్‌రెడ్డి భూమి పూజ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో వసతుల కల్పన, పలు పథకాలను అమలు చేస్తోందన్నా రు. విద్యార్థులు వినియోగించుకొని ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించా రు. గాంధీ బజార్‌లోని ఇంజనీయరింగ్‌ కార్యాలయం వద్ద మరమ్మతులు చేసిన పశు వైద్యశాల భవనాన్ని ప్రారంభించారు. దర్గా గ్రామానికి వెళ్లే రహదారిలోని ఈద్గా వద్ద తాగు నీటి కోసం ఏర్పా టు చేసిన బోరును అశోక్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సోరెడ్డి మోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ సత్యవతి, భూపాల్‌రెడ్డి, సత్యేలి కృష్ణ, సైదులు, రమే్‌ష, ప్రేమానంద్‌, శ్రీనీశ్వరరెడ్డి, రోషన్‌, అనిత, మూప్పూరి రాము, తీగిరెడ్డి బూ పాల్‌రెడ్డి, దూదేకుల ఆదాం పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 10:36 PM