త్వరలో ప్రతి ఇంటికీ నీటి సదుపాయం
ABN , Publish Date - May 16 , 2025 | 11:09 PM
అతి త్వరలో ప్రతి ఇంటికీ నిరంతరం ఉచిత మంచినీటి సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చెప్పారు.
గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి
1.2 కోట్లతో పట్టణంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన
గిద్దలూరు టౌన్, మే 16 (ఆంధ్రజ్యోతి): అతి త్వరలో ప్రతి ఇంటికీ నిరంతరం ఉచిత మంచినీటి సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం పట్టణంలోని శ్రీనివాస నగర్, పాములపల్లె రోడ్డు, నల్లబండ బజారు, టీచర్స్ కాలనీలలో సుమారు రూ.1.2 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఎన్‌డీఏ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని తెలిపారు. గతంలో వర్షం పడితే గుంతలమయంగా ఉన్న రోడ్లలో సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు తెరిచే సమయానికి ప్రతి తల్లి అకౌంట్‌లో విద్యార్థికి రూ.15వేలు జమ చేయనున్నట్లు అన్నారు. పట్టణంలో ప్రధానంగా ఉన్న సమస్యలను ఇచ్చిన హామీ ప్రకారం రైల్వే ఓవర్ బ్రిడ్జి, సగిలేరు వాగుకు రక్షణ గోడ నిర్మాణం, నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం 160 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాముల వెంకటసుబ్బయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు సయ్యద్ షానేషావలి, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.