కొణిదెన- గంగపాలెం గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు
ABN , Publish Date - Sep 27 , 2025 | 02:12 AM
మండలంలోని కొణిదెన- గంగపాలెం మధ్య రహదారి, వంతెన పూర్తిగా దెబ్బతింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడు తోంది.
బల్లికురవ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొణిదెన- గంగపాలెం మధ్య రహదారి, వంతెన పూర్తిగా దెబ్బతింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడు తోంది. ఇటీవల భారీ వర్షాలు కురవటంతో పెద్దఎత్తున వర్షపు నీరు రోడ్డుపై నిలిచింది. దీంతో రాకపోకలు స్తంభించాయి. మండలం లోని కొణిదెన ఉప్పుమాగులూరు పంచాయతీ రాజ్ బీటీ రోడ్డులో గంగపాలెం సమీపంలో ఉన్న నేల చప్టా పూర్తి స్థాయిలో ధ్వంసమైంది. ఈ చప్టాలో ఉన్న గోతులలో నీరు నిలబడడంతో శుక్రవారం రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పెద్ద వాహనాలు ఈ రోడ్డులో వచ్చే వీలులేక పోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిత్యం గ్రానైట్ ముడిరాయి లారీలు తిరిగే రోడ్డులో రాకపోకలు లేక పోవడంతో పరిశ్రమలకు రాళ్ల రవాణా నిలిచి పోయింది. ద్విచక్ర వాహనాల వారు మాత్రం చప్టా అంచులో ఉన్న కొద్ది పాటి రోడ్డులో భయం భయంతో ప్రయాణం సాగిస్తున్నా రు. ఈ రోడ్డు అధ్వాన స్థితికి చేరిం దని కొణిదెన గ్రామం నుండి ఉప్పు మాగులూరు వరకు రోడ్డులో మోకాటి లోతు గోతులు ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ రోడ్డుకు నిధులు మంజురు చేసి నేల చప్టా ఎత్తుపెంచి రోడ్డును అభివృద్ధి పరచాలని కోరుతున్నారు.