గానుగపెంటలో నీటి సమస్య
ABN , Publish Date - Nov 20 , 2025 | 10:32 PM
మండలంలోని గానుగపెంటలో తీవ్ర మంచినీటి సమస్య నెలకొంది. గ్రామంలో ఉన్న డీప్ బోర్లు ఇంకి పోవడంతోపాటు సాగర్ జలాలు 4 రోజులకు ఒకసారి వస్తుండడంతో ప్రజలు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఎక్కువగా పశు పోషణపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నీటి సమస్య తలెత్తడంతో పశువులకు కూడా పొలాల్లోనే నీరు పెట్టాల్సిన పరిస్థితి నెలకుందని పోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగురోజులకోసారి అరకొర సరఫరా
అల్లాడుతున్న స్థానికులు
తర్లుపాడు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని గానుగపెంటలో తీవ్ర మంచినీటి సమస్య నెలకొంది. గ్రామంలో ఉన్న డీప్ బోర్లు ఇంకి పోవడంతోపాటు సాగర్ జలాలు 4 రోజులకు ఒకసారి వస్తుండడంతో ప్రజలు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఎక్కువగా పశు పోషణపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నీటి సమస్య తలెత్తడంతో పశువులకు కూడా పొలాల్లోనే నీరు పెట్టాల్సిన పరిస్థితి నెలకుందని పోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఉన్న డీపు బోర్లు రెండు నెలల నుంచి మరమ్మతులకు గురయ్యాయి. బోర్లకు మరమ్మతులు చేయించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకున్న దాఖలాలు లేవు. గ్రామానికి సరఫరా అయ్యే సాగర్ జలాలు కూడా నాలుగు రోజులకు ఒకసారి ఒక గంటపాటు వస్తాయి. దీంతో గ్రామస్థులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. సాగర్ జలాలను నింపిన ఓవర్ హెడ్ ట్యాంక్ గత సంవత్సరం నుంచి శుభ్రం చేయకపోవడంతో సరఫరా అయ్యే నీరు కూడా మలినాలతో వస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో ఉన్న డీప్ బోర్లకు మరమ్మతులు చేయిం చి ఓవర్ హెడ్ ట్యాంక్‌ను మరమ్మతులు చేయించి సాగర్ జలాలు రోజు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.