రామతీర్థంకు జలకళ
ABN , Publish Date - Aug 07 , 2025 | 02:25 AM
త నాలుగు రోజులుగా నిరాటంకంగా చేరుతున్న సాగర్ జలాలతో రామతీర్థం రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది. జలాశయం గరిష్ఠ నీటి మట్టం 85 మీటర్లు కాగా.. ప్రస్తుతం 83 మీటర్లకు చేరుకొంది.
1,125 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
గరిష్ఠ మట్టంకు మరో రెండు మీటర్లు
నేడు దిగువకు జలాలు విడుదల
చీమకుర్తి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): గత నాలుగు రోజులుగా నిరాటంకంగా చేరుతున్న సాగర్ జలాలతో రామతీర్థం రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది. జలాశయం గరిష్ఠ నీటి మట్టం 85 మీటర్లు కాగా.. ప్రస్తుతం 83 మీటర్లకు చేరుకొంది. మరో రెండు మీటర్లు చేరితే నిండుతుంది. బుధవారం రిజర్వాయర్‌కు 1,125 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తోంది. ఇదేవిధంగా మరో నాలుగు రోజులు ఖాయంగా సాగర్ జలాలు వస్తాయని నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కువ జలాలను వినియోగించుకునే ఉద్దేశంతో దిగువకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఇది రైతులకు సంతోషకరమైన విషయం కాగా, ఆయకట్టు కింద ఖరీఫ్ సాగు ఊపందుకోనుంది.