కనిగిరి మున్సిపాలిటి డీ లిమిటేషన్‌కు వార్డు సర్వే చేపట్టాలి
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:03 PM
కనిగిరి మున్సిపాలిటీ డీ లిమిటేషన్‌కు సచివాలయ సర్వే నిర్వహించాలని టీపీవో సువర్ణకుమార్ చెప్పారు.
కనిగిరి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : కనిగిరి మున్సిపాలిటీ డీ లిమిటేషన్‌కు సచివాలయ సర్వే నిర్వహించాలని టీపీవో సువర్ణకుమార్ చెప్పారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశపు హాలులో శుక్రవారం సచివాలయ టౌన్‌ప్లానింగ్ సిబ్బందితో మున్సిపల్ మేనేజర్ ప్రసాద్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026 మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా కనిగిరి మున్సిపాల్టీ పరిధిలోని ప్రస్థుతం ఉన్న 20 వార్డులను 28 వార్డులుగా విభజించి వార్డు బౌండరీలను ఏర్పాటు చేసి అక్టోబరు 14వ తేదీలోపు ప్రక్రియ పూర్తి చేసి నివేదిక అందచేయాలని ఆదేశించారు.