Share News

బస్సు కోసం నిరీక్షణ

ABN , Publish Date - Mar 17 , 2025 | 11:39 PM

కనిగిరి ఆర్టీసీ డిపోలో బస్సుల సమ యాలను ఇష్టారీతిగా మారుస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. గత రెండు నెలలుగా కనిగిరి నుంచి సీఎస్‌పురంకు ఉదయం 11.30లకు బస్సు బయలుదేరుతుంది. దీనిని అర్ధంతరంగా తొల గించారు. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకావడంతో తల్లిదండ్రులు కనిగిరి వచ్చారు.

బస్సు కోసం నిరీక్షణ

కనిగిరి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): కనిగిరి ఆర్టీసీ డిపోలో బస్సుల సమ యాలను ఇష్టారీతిగా మారుస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. గత రెండు నెలలుగా కనిగిరి నుంచి సీఎస్‌పురంకు ఉదయం 11.30లకు బస్సు బయలుదేరుతుంది. దీనిని అర్ధంతరంగా తొల గించారు. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకావడంతో తల్లిదండ్రులు కనిగిరి వచ్చారు. 12 గంటలకు పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థులలకు ధైర్యం చెప్పి తల్లిదండ్రులు తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం 2.30 వరకు సీఎస్‌పురంకు బస్సు రాకపోవటంతో సిబ్బందిని ప్రశ్నించినా స్పందనలేదని ప్రయాణికులు యూరవ వెంకటసుబ్బయ్య, వెం కటలక్షమ్మ, వెంకటయ్య, నరసయ్య, ఊసా వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. విధిలేక ఆటోలను ఆశ్రయించి గమ్యస్థానాలకు వెళ్లారు.

Updated Date - Mar 17 , 2025 | 11:39 PM