జీవో-4పై వీఆర్వోల నిరసన
ABN , Publish Date - May 20 , 2025 | 10:42 PM
జీవో నెం.4 వలన వీఆర్వోలకు పనిభారం పెరుగుతుందని మంగళవారం తహసీల్దార్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.
పొదిలి, మే 20 (ఆంధ్రజ్యోతి) : జీవో నెం.4 వలన వీఆర్వోలకు పనిభారం పెరుగుతుందని మంగళవారం తహసీల్దార్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వీఆర్వోల సంఘం అధ్యక్షుడు బాలవెంకటరెడ్డి మా ట్లాడుతూ ప్రభుత్వం సచివాలయాల రేషనలైజేషన్ ప్రక్రియలో ఇచ్చిన జీవోఎంఎస్ నెంబర్ 4 వలన వీఆర్వోల క్యాడర్‌కు, ప్రమోషన్ చానల్‌కు అదే విధంగా మి గులు సిబ్బందిని వీఆర్వోలను నియమించేందుకు, వీఆర్వోలపై తీవ్రమైన ఒత్తిడిభారం పడుతుందన్నారు. అందకు నిరసనగా రాష్ట్ర, జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం సూచనల మేరకు నిరసన కార్యక్రమం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వీఆర్వోలు కిలారి సుబ్బారావు, అనిల్, రమేష్, బాబాజీ, సంతోష్, నారాయణ, సురేష్ పాల్గొన్నారు.