Share News

ప్రతి ఓటుకూ ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలి

ABN , Publish Date - May 23 , 2025 | 12:16 AM

జిల్లాలో ప్రతి ఒక్క ఓటుకూ ఆధార్‌ అనుసంధానం చేసుకొనే విధంగా రాజకీయ పార్టీలు సహకరించాలని డీఆర్వో చిన ఓబులేషు కోరారు.

ప్రతి ఓటుకూ ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలి
రాజకీయ పార్టీల సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్వో ఓబులేషు

ఒంగోలు కలెక్టరేట్‌, మే 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రతి ఒక్క ఓటుకూ ఆధార్‌ అనుసంధానం చేసుకొనే విధంగా రాజకీయ పార్టీలు సహకరించాలని డీఆర్వో చిన ఓబులేషు కోరారు. స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్వో చాంబర్‌లో గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అలా అనుసంధానం చేసుకోకపోతే ఓటును కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అంతకు ముందు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ జిల్లాలో చనిపోయిన వారి ఓట్లను ఇప్పటి వరకు ఎన్ని తొలగించారని డీఆర్వో దృష్టికి తెచ్చారు. ఒంగోలు నగరంతో పాటు ఇతర మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో డోర్‌ నంబర్లు లేకపోవడం వల్ల కొత్తగా ఓట్లు చేర్చుకోనేందుకు ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆయాఅంశాలపై డీఆర్వో మాట్లాడుతూ ఒంగోలు నగరంతో పాటు మునిసిపాలిటీల్లో డోరు నెంబర్లు వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు, కనిగిరి ఆర్డీవోలు లక్ష్మీప్రసన్న, కేశవర్థనరెడ్డి, స్పెషల్‌ డిప్యూటీకలెక్టర్లు ఎం. వెంకటశివరామిరెడ్డి, జాన్సన్‌, బ్రహ్మయ్య, మంజునాథరెడ్డి, ఎంవీ సత్యనారాయణ, ఎన్నికల సెల్‌ సూపరిటెండెంట్‌ రాజ్యలక్ష్మీ, వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులు వెంకటరావు, డీఎస్‌ క్రాంతికుమార్‌, రమేష్‌, ఎస్‌కే రసూల్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - May 23 , 2025 | 12:16 AM