ఎస్‌ఐపై దౌర్జన్యం
ABN , Publish Date - Jun 04 , 2025 | 02:24 AM
పోలీసు విధులకు ఆటంకం కల్పించడంతోపాటు దౌర్జన్యానికి దిగిన మండ లంలోని జాళ్లపాలెం గ్రామానికి చెందిన మారంరెడ్డి కొండలరావు, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. మర్రిపూడి ఎస్‌ఐ రమేష్ ఫిర్యాదు మేరకు కొండ పి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రేమ్‌కుమార్ మంగళవారం తెలిపారు.
ఫుటేజీ కోసం వెళ్లగా అడ్డుకున్న రౌడీషీటర్ కుటుంబం
ఆపై తమపైనే దాడి అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం
అనుకూలంగా మార్చుకున్న వైసీపీ మీడియా
రౌడీషీటర్ కొండలరావుపై కేసు నమోదు
కొండపి, జూన్ 3, (ఆంధ్రజ్యోతి): పోలీసు విధులకు ఆటంకం కల్పించడంతోపాటు దౌర్జన్యానికి దిగిన మండ లంలోని జాళ్లపాలెం గ్రామానికి చెందిన మారంరెడ్డి కొండలరావు, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. మర్రిపూడి ఎస్‌ఐ రమేష్ ఫిర్యాదు మేరకు కొండ పి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రేమ్‌కుమార్ మంగళవారం తెలిపారు. ఆయన కథ నం ప్రకారం కొండలరావుపై ఇప్పటికే రౌడీషీట్ ఉంది. అతనిపై ఎనిమిది కేసులు ఉన్నాయి. విధి నిర్వహణను అడ్డుకోవడంతోపాటు విలువైన సమాచారాన్ని నాశనం చేస్తానని బెదిరించడంపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఘటన జరిగిందలా... గతనెల 26వతేదీ పొన్నలూరు మండలం నాగిరెడ్డిపాలెం, 28న కొండపి మండలంలోని పెట్లూరులో, అదేరోజు జరుగుమల్లి మండలం ఎన్‌ఎన్.కండ్రిగ గ్రామాల్లోని పలు దేవాలయాల్లో చోరీలు జరిగాయి. దొంగలను పట్టుకునేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మర్రిపూడి ఎస్‌ఐ రమేష్ నేర పరిశోధన ప్రారంభించారు. అందులోభాగంగా ఆయా గ్రామాల నుంచి వెళ్లే రోడ్లలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఎన్‌ఎన్.కండ్రిగ, పెట్లూరు గ్రామాలకు మధ్యలో ఉండే జాళ్లపాలెంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా జాళ్లపాలెంలోని బ్రహ్మంగారి మఠం సమీపంలో ప్రధాన కూడలిలో కొండలరావు గృహం, అందులోనే వాటర్‌ప్లాంట్, చిల్లరకొట్టు ఉంది. దుకాణం ముందుభాగంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. నేర పరిశోధనలో భాగంగా గతనెల 28వతేదీ ఉదయం ఎస్‌ఐ రమేష్ దుకాణంలో ఉన్న కొండలరావు చెల్లెలు బండి చంద్రమ్మను సీసీ ఫుటేజ్ చూపించాలని, తాము పోలీసులమని, నేరపరిశోధనలో సహకరించాలని కోరారు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా చంద్రమ్మ కొండలరావుకు తెలిపింది. ఫోన్‌లోనే కొండలరావు పోలీసులకు తాను సహకరించనని, సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వబోనని, సమాచారం ఉన్నా డిలిట్ చేస్తానని, డివిఆర్‌ని, మానిటర్‌ని తగులబెడతానని తెలిపాడు. దీంతో ఎస్‌ఐ దుకాణంలోకి వెళ్లి ఫుటేజ్ చూస్తానని ప్రవేశించబోగా, చంద్రమ్మ బయటకు నెట్టేసింది. దీంతో ఎస్‌ఐ, సిబ్బంది తమకు అడ్డుగా వస్తున్న చంద్రమ్మ, ఇతర సభ్యులను పక్కకు నెట్టారు. ఈ ఘటన కూడా సీసీ కెమెరాలలో రికార్డైంది. కాగా దాన్ని పోలీసులు తమ కుటుంబసభ్యులపై దౌర్జన్యం చేశారని సామాజిక మాధ్యమాల్లో కొండలరావు ప్రచారం చేశారు. వైసీపీ కార్యకర్తలపై పోలీసుల జులుం అంటూ కొన్ని యూట్యూబ్ చానళ్లు, వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో కొండలరావు ఓ పథకం ప్రకారం తప్పుడు ప్రచారం చేశారు. ఈ ఘటనపై ఎస్పీ సీరియస్ అయ్యారు. పోలీసుల విధి నిర్వహణను అడ్డుకున్న కొండలరావు, కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు.