Share News

వినాయక చవితి కోలాహలం

ABN , Publish Date - Aug 27 , 2025 | 01:19 AM

పట్టణంలో వినాయక చవితి కోలాహలం నెలకొంది. గణనాధుని ప్రతిమలు, ప్రతుల కోసం ప్రజలకు మార్కెట్‌ కూడలి కి రావడంతో ఆ ప్రాంతం అంతా రద్ధీగా మారింది.

వినాయక చవితి కోలాహలం

చీరాల, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలో వినాయక చవితి కోలాహలం నెలకొంది. గణనాధుని ప్రతిమలు, ప్రతుల కోసం ప్రజలకు మార్కెట్‌ కూడలి కి రావడంతో ఆ ప్రాంతం అంతా రద్ధీగా మారింది. చీరాల కూరగాయల మార్కెట్‌, క్లాత్‌మార్కెట్‌లతో పాటు, ఈపూరుపాలెం, వేటపాలెం గడియార స్తంభం కూడలిలో రద్ధీ పెరిగింది. భక్తులు, చిన్నారులు, మహిళలు ఉదయం నుంచే వినాయకుని ప్రతిమలు, ప్రతులు కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్దకు బారలు తీరారు.

నిమజ్జనాలపై ప్రత్యేక దృష్టి సారించండి

వినాయక నిమజ్జనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు సూచించారు. మంగళ వారం డీఎస్పీ ఎండీ మొయిన్‌తో కలిసి అన్ని ప్రభుత్వ విభాగాల అఽధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహిం చారు. ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్‌, వాడరేవు, రామాపురం, కఠారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం తీర ప్రాంతాల్లో నిమజ్జనాలకు భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. విపత్కర పరిస్థితులలో వెంటనే ఆయా శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

చీరాల : ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని చీరాల వాకర్స్‌ అసోసి యేషన్‌ ప్రతినిధులు పిలుపునిచ్చారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రూ.28వేల విలువైన 1500 మట్టి వినాయక ప్రతిమలను భక్తులకు పంపిణీ చేశారు. అందరూ ఆనందంగా పండుగను నిర్వహించు కోవాలని ఆకాంక్షించారు. పట్టణంలోని గడియార స్తంభం కూడలిలో ఎమ్మెల్యే ఎంఎం.కొండయ్య మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పోలుదాసు రామకృష్ణ, గురుప్రసాద్‌, నారాయణమూర్తి, అమర్‌చంద్‌, సుబ్బారావు, శ్రీనివాసరావు, సత్యనారా యణ, సురేష్‌, కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

అద్దంకి : మండపాలలో కొలువుదీరేందుకు గణనాథులు తరలి వెళ్లారు. బుధవారం వినాయక చవితి నేపద్యంలో వీధి వీధిన పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. అద్దంకిలోని తయారీ కేంద్రాల నుంచి సుమారు 300కు పైగా వినాయక వి గ్రహాలను పట్టణంతో పాటు అద్దంకి, ముండ్లమూరు, తాళ్లూరు, బల్లికురవ, సంతమాగులూరు, పంగులూరు, కొరిశపాడు తదితర మండలాలలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసేందుకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. చిన్నారులు సైతం ఉత్సాహంగా బుల్లి వినాయకులను తీసుకెళ్లారు. పట్టణంలోని పాతబస్టాండ్‌ కూడలిలో పూజా సామగ్రి అమ్మకాలతో రద్దీ ఏర్పడింది. దీంతో సందడి నెలకొంది.

మట్టి వినాయక ప్రతిమలనే ఉపయోగించండి

అద్దంకిటౌన్‌ : ప్రకృతి కాలుష్యం, జలకాలుష్యం లేని మట్టివినాయక ప్రతిమలనే భక్తులందరూ ఉపయోగిం చాలని రోటరీక్లబ్‌ అధ్యక్షుడు బాచిన శివధర పూర్ణచంద్రరావు అన్నారు. మంగళవారం పట్టణంలో రోటరీ క్లబ్‌ ఆఫ్‌ శింగరకొండ ఆధ్వర్యం లో వినాయక చవితి పండుగ సందర్భంగా తమ కార్యాలయం వద్ద పట్టణ ప్రజలకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రోటరీ సెక్రటరీ అలహరి హరి ప్రసాద్‌, చిన్ని మురళీకృష్ణ, మహ్మమద్‌రఫీ, వీరయ్య, రామకోటేశ్వరరావు, అంజాద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

మట్టి విగ్రహాలతో బాలికల ప్రదర్శన

వినాయక చవితి పండుగ సందర్బంగా ప్రకాశం బాలికల ఉన్నత పాఠశాల విద్యార్ధునులు తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలతో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. పర్యవరణ కాలుష్యాన్ని నివారించేం దుకు భక్తులు మట్టి వినాయక విగ్రహాలను పూజించా లని పీడీ కృష్ణారావు అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

గణనాథుని మట్టి ప్రతిమల పంపిణీ

పర్చూరు : రోటరీ క్షబ్‌ ఆఫ్‌ పర్చూరు సెంట్రల్‌ ఆధ్వర్యంలో స్ధానిక రోటరీ గంగా వద్ద మంగళవారం 650 మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు తోకల కృష్ణమోహన్‌, నాగబైరు శ్రీనివాసరావు, పాబోలు ఉధయ భాస్కర్‌, వెంకన్న, కాసా అశోక్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు మట్టి విగ్రహాల పంపిణీ

చినగంజాం : స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు వినాయక చవతి పండుగను పురస్కరించుకొని పాఠశాలలోని ఈకో క్లబ్‌, ఈగల్‌ క్లబ్‌ విద్యార్థులు, ఉపాఽధ్యాయుల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాల వలన పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. పర్యావరణానికి హాని లేని మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని, మీ చుట్టుపక్కల వారు కూడా వాడేట్లు చూడాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాఽధ్యాయులు ఎస్‌.నరసింహా రావు, సుబ్బారావు, కోటిరెడ్డి, నాగేశ్వరరావు, రామ్‌ కుమార్‌, ఈకో క్లబ్‌ ఉపాధ్యాయులు ఉదయభానేశ్వరి, జ్యోతి, ఈగల్‌ క్లబ్‌ ఉపాధ్యాయులు ఏ.అరుణకుమారి, ప్రసాద్‌రావు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2025 | 01:19 AM