‘పల్లె వెలుగు’ చూడని గ్రామాలు
ABN , Publish Date - Sep 07 , 2025 | 10:52 PM
పల్లెవెలుగు బ స్సులు గత కొ న్ని సంవత్సరా లుగా మండలం లోని పలు గ్రా మాలకు రావ డంలేదు. ప్రస్తు తం ఆర్టీసీ బ స్సులు దొనకొండ నుంచి దర్శి మీదుగా ఒంగోలు, దొనకొండ నుంచి కొ చ్చెర్లకోట మీదుగా ఎర్రగొండపాలెంకు తిరుగుతున్నాయి.
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
విద్యార్థులకు తప్పని ఆటో ప్రయాణం
దొనకొండ, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): పల్లెవెలుగు బ స్సులు గత కొ న్ని సంవత్సరా లుగా మండలం లోని పలు గ్రా మాలకు రావ డంలేదు. ప్రస్తు తం ఆర్టీసీ బ స్సులు దొనకొండ నుంచి దర్శి మీదుగా ఒంగోలు, దొనకొండ నుంచి కొ చ్చెర్లకోట మీదుగా ఎర్రగొండపాలెంకు తిరుగుతున్నాయి. అవికూడా ఒకటి రెండు బస్సులు దొనకొండ - పొదిలి ప్రధాన రహదారుల్లో మాత్రమే రా కపోకలు జరుపుతుండటంతో కొన్ని గ్రామాల ప్రజలకే బస్సు ప్రయాణ సౌ కర్యం లభిస్తుంది. దొనకొండ నుంచి మార్కాపురం, ప్రముఖ బౌద్ధక్షేత్రమైన చందవరం మీదుగా త్రిపురాంతకం, కురిచేడు మీదుగా వినుకొండకు వెళ్లే మార్గంలో పలు గ్రామాలకు తారురోడ్డు సౌకర్యం ఉన్నా బస్సులు తిరగ డంలేదు. దీంతో ప్రజలు ఆటోలలో రాకపోకలు జరుపుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పలు గ్రామాల విద్యార్థులు మండలకేంద్రమైన దొనకొండలోని పాఠశాలలు, కాలేజీలకు రాకపోకలు జరుపుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో దొనకొండ నుంచి జిల్లా కేంద్రమైన ఒంగోలుకు ఉదయం, సాయంత్రం తిరిగే బస్సును ఆర్టీసీ అధికారులు రద్దు చేయటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు.
కూటమి ప్రభుత్వం స్ర్తీశక్తి పథకంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మండలంలోని పలు గ్రామాలకు ఉండటంలేదు. బాదాపురం, ఎర్రబాలెం, రామిరెడ్డిపల్లి, పోలేపల్లి, కందులవారిపల్లి, చందవరం, బట్టెపాడు, లక్ష్మీపురం, రామాపురం, ఇండ్లచెరువు, వెంకటాపురం, రాగమక్కపల్లి, భూమనపల్లి, మల్లంపేట, మంగినపూడి, సిద్దాయిపాలెం, అనంతవరం, వద్దిపాడు, సంగాపురం, పికంభంపాడు తదితర గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ఏళ్ల తరబడి ఆటోలలో, ఇతర ప్రైవేట్ వాహనాల్లో రాకపోకలు జరుపుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ అధికారులకు మండల సర్వసభ్య సమావేశాల్లో ఎన్నోసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తారురోడ్డు సౌకర్యం ఉన్న గ్రామాలకైనా ఆర్టీసీ బస్సులను ఏర్పాటుచేసి తమ ప్రయాణ ఇక్కట్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.