Share News

ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్‌ తనిఖీలు

ABN , Publish Date - Sep 07 , 2025 | 10:50 PM

రాష్ట్రం లో యూరియాను కృత్రిమ కొరత సృష్టిస్తున్నా రని భావించిన ప్రభుత్వం ఎరువుల దుకాణాల ను తనిఖీ చేయాలని విజిలెన్స్‌, పోలీసు, రెవె న్యూ, వ్యవసాయ తదితర శాఖల అధికారులను ఆదేశించింది.

ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్‌ తనిఖీలు
ఎరువుల బస్తాలను పరిశీలిస్తున్న అధికారులు

బిల్లులు లేకుండా నిల్వఉన్న పది టన్నుల డీఏపీ

అమ్మకాలు నిలిపివేయాలంటూ ఆదేశించిన అధికారులు

పీసీపల్లి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో యూరియాను కృత్రిమ కొరత సృష్టిస్తున్నా రని భావించిన ప్రభుత్వం ఎరువుల దుకాణాల ను తనిఖీ చేయాలని విజిలెన్స్‌, పోలీసు, రెవె న్యూ, వ్యవసాయ తదితర శాఖల అధికారులను ఆదేశించింది. ఇందులోభాగంగా కొద్దిరోజులుగా వివిధ శాఖల అధికారులు ఎరువుల దుకాణాలను తనిఖీ చేస్తున్నారు. పీసీపల్లిలో వీరవెంకటరమణ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ ఫెస్టిసైడ్స్‌, వెంకట కామాక్షి ట్రేడర్స్‌లను విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అఽధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీ లలో వీర వెంకటరమణ ఫెర్టిలైజర్స్‌ గోడౌన్‌లో కొనుగోలు పత్రాలులేని 10.2టన్నుల డీఏపీని గుర్తించారు. నిల్వ ఉన్న డీఏపీకి సంబంధించిన కొనుగోలు బిల్స్‌ చూపించమని విజిలెన్స్‌ సీఐ రాఘవరావు దుకాణ యజమానిని కోరారు. బిల్స్‌ కనిపించడం లేదని దుకాణ యజమాని అఽధికారులకు చెప్పాడు. డీఏపీ కొనుగోలుకు సంబంధించిన బిల్స్‌ తమకు చూపించేవరకు విక్ర యించవద్దని ఆదేశించారు. బిల్లులు లేకుండా నిల్వ ఉం చిన డీఏపీ విలువ రూ.2.7లక్షలు ఉంటుందని ఏవో రంగాక్రిష్ణ తెలిపారు.

ఈసందర్భంగా విజిలెన్స్‌ సీఐ రాఘవరావు మాట్లాడు తూ రైతులకు యూరియాను అందుబాటులో ఉంచాలని దుకాణ యజమానులను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించి యూరియాను బ్లాక్‌లో విక్ర యిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మార్పీ రేట్లకంటే అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుం టామన్నారు. దాడుల్లో విజిలెన్స్‌ సీఐతో పాటు ఏవో శివనాగప్రసాద్‌, పీసీపల్లి ఏవో ఎన్‌.రంగాక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 10:50 PM