Share News

ఆశా వర్కర్‌ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన

ABN , Publish Date - Dec 09 , 2025 | 02:08 AM

జిల్లాలో ఆశా వర్కర్లుగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టరేట్‌లోని వైద్యశాఖ కార్యాలయ ఆవరణలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ టి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతోంది.

ఆశా వర్కర్‌ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన
అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్న అధికారులు

ఆశా వర్కర్‌ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన

భారీగా అభ్యర్థుల హాజరు

డీఎంహెచ్‌వో కార్యాలయంలో కోలాహలం

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఆశా వర్కర్లుగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టరేట్‌లోని వైద్యశాఖ కార్యాలయ ఆవరణలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ టి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతోంది. ఇటీవల 152 ఆశావర్కర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. అందుకోసం 1ః2 ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. దీంతో వైద్యశాఖ కార్యాలయం సోమవారం కోలాహలంగా మారింది. కొంతమంది అభ్యర్థుల సర్టిఫికెట్లపై ఫిర్యాదులు రావడంతో అటువంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో డీఎల్‌టీవో డాక్టర్‌ బాలాజీ, డాక్టర్‌ పి.కమలశ్రీ, పలువురు కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 02:08 AM