వాహనాల రాకపోకలు బంద్
ABN , Publish Date - Sep 27 , 2025 | 09:57 PM
కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలు శనివారం తాత్కాలింకంగా ని లిపి వేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పరిధిలోని సిద్ధా పురం చెరువు నిండి అలుగు ద్వారా వరద నీరు నల్లమలలోని బైర్లూటి వద్ద రోడ్డుపై ఉఽ దృతంగా ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు వాహన రాకపోకలను నిలిపివేశారు.
కర్నూలు - గుంటూరు జాతీయ రహదారిలో
నల్లమలలోని బైర్లూటి రోడ్డుపై ఉధృతంగా వరద
కర్నూలు వైపు వెళ్లేవి దారి మళ్లింపు
పెద్ద దోర్నాల, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలు శనివారం తాత్కాలింకంగా ని లిపి వేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పరిధిలోని సిద్ధా పురం చెరువు నిండి అలుగు ద్వారా వరద నీరు నల్లమలలోని బైర్లూటి వద్ద రోడ్డుపై ఉఽ దృతంగా ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు వాహన రాకపోకలను నిలిపివేశారు. మందస్తు చర్యల్లో భాగంగా గుంటూరు వైపు నుంచి కర్నూలు వైపు వెళ్లే వాహనాలను కుంట వద్ద నుంచి దారి మళ్లించి గిద్దలూరు - నంద్యాల మీదుగా తరలిస్తున్నట్లు ఎస్‌ఐ వీ మహేష్ తెలిపారు.