Share News

పేదల కోసం అహర్నిశలు కృషి చేసిన వంగవీటి రంగా, కనకయ్య

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:39 PM

పేదల అభ్యున్నతి కోసం దివంగత నేతలు వంగవీటి మోహనరంగా, కనకం వెంకయ్యలు జీవితాంతం కృషి చేశారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు.

పేదల కోసం అహర్నిశలు కృషి చేసిన వంగవీటి రంగా, కనకయ్య
విగ్రహాల ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తున్న డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పాపారావు తదితరులు

దర్శి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): పేదల అభ్యున్నతి కోసం దివంగత నేతలు వంగవీటి మోహనరంగా, కనకం వెంకయ్యలు జీవితాంతం కృషి చేశారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి-అద్దంకి రోడ్డులో పంచాయతీ రాజ్‌ కార్యాలయం వద్ద దివంగత నేతల విగ్రహాలఏర్పాటుకు మంగళవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా డాక్టర్‌ లక్ష్మి మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా పేద ప్రజల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసి వారి హృదయాల్లో నిలచారన్నారు. దివంగత నేత కనకం వెంకయ్య దర్శి పంచాయతీ సర్పంచ్‌గా సుమారు 20 ఏళ్లు పనిచేసి పేదల అభ్యున్నతికి, దర్శి అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆ మహనీయుల విగ్రహలు ఏర్పాటు చేసే అవకాశం రావటం ఆనందదాయకమన్నారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్‌ కడియాల లలిత్‌సాగర్‌, తహసీల్దార్‌ ఎం.శ్రావణ్‌కుమార్‌, మున్సిపల్‌ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్‌ దారం నాగవేణి, సుబ్బారావు, దర్శి సొసైటీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌, మాజీ ఎంపీపీ ఫణిదపు వెంటకరామయ్య, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పుల్లలచెరువు చిన్నా, మాజీ అధ్యక్షుడు యాదగిరి వాసు, కౌన్సిలర్లు కనకం శ్రీనివాసరావు, వీసీ రెడ్డి, ఎం.శోభారాణి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం శివరాజ్‌నగర్‌లో మురుగుకాల్వల నిర్మాణానికి డాక్టర్‌ లక్ష్మి శంకుస్థాపన చేశారు.

Updated Date - Nov 18 , 2025 | 11:39 PM