Share News

భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:26 PM

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు.

భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి

అద్దంకి,డిసెంబరు30(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు. పట్టణంలోని కాకానిపాలెంలో ఉన్న రంగ నాయకస్వామి దేవాలయం వద్ద ఉత్తర ద్వార దర్శనా నికి భక్తులు వేకువజాము నుండే బారులు తీరారు. మఽధ్యాహ్నం వరకు భక్తులు పెద్దసంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈవో శైలేంద్రకుమార్‌ ఏర్పా ట్లను పర్యవేక్షించారు. మహిళలు, చిన్నారులు ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం వద్ద ఉత్తర ద్వార దర్శనం వద్ద పీడీసీసీ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ మేదరమెట్ల శంకరారెడ్డి, ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ చుండూరి మురళీసుఽధాకారరావు, ఈఓ తిమ్మానాయుడు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీనరశింహస్వామి దేవాలయాలలో ఉత్తర ద్వారం వద్ద విజయవాడ విద్యుత్‌శాఖ అధికారి భార్గవ శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ గుంజి శ్రీనివాసరావు, ఈఓ మద్దినేని శ్రీనివాసరావు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చీరాల ఆర్‌డీవో చం ద్రశేఖరనాయుడు, తహసీల్దార్‌ శ్రీచరణ్‌లు అద్దంకి లోని రంగనాయకస్వామి దేవాలయం, శింగరకొండ లక్ష్మీనరశింహస్వామి దేవాలయం, ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అద్దంకిలోని మాధవస్వామి దేవాలయం, బ్రహ్మంగారి దేవాలయం తదితర దేవాలయాలలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు.

బల్లికురవ : మండలంలోని కొణిదెన గ్రామంలో ఉన్న చెన్నకేశవస్వామి స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. కొణిదెన, గంగపాలెం, రాజు పాలెం, నక్కబొక్కలపాడు, మార్టురు గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకొన్నారు.

చీరాల : వైకుంఠ ఏకాదశిను పురస్కరించుకుని చీరాల పరిధిలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ నుండే భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని విశేషంగా అలంకరించారు. పేరాల మదన గోపాలస్వామి ఆలయం భక్తులతో నిండింది.

పర్చూరు : వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) సందర్భంగా పలు వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం కల్పిం చారు. స్వామివార్లను దర్శించుకొ నేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మండలంలోని వెంక టేశ్వరస్వామి ఆలయాలు, పర్చూరు భీమేశ్వరస్వామి ఆలయం, శ్రీవేణుగోపాల స్వామివార్ల ఆలయాల్లో విశేష పూజలు చేశారు. దేవాదాయశాఖ అధికారి దామా నాగేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చెరుకూరు త్రివిక్రమ అగస్తేశ్వర స్వామివార్ల ఆలయంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

కారంచేడు(పర్చూరు) : కారంచేడులోని వేణుగోపా ల స్వామి, ఆదిపూడిలో వెంకటేశ్వరస్వామి, స్వర్ణలో వేణుగోపాల స్వామి వార్ల ఆలయాల్లో అత్యంత వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

చినగంజాం : పెదగంజాం భూనీల సమేత భావనారాయణ స్వామి, కడవకుదురు గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి, సీతా లక్ష్మణ హనుమత్‌ సమేత కోదండరామస్వామి దేవస్థానం, సంతరావూరు లక్ష్మీ చెన్నకేశవస్వామి, చినగంజాం భూదేవి శ్రీదేవి సమేత భావనారాయణస్వామి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు.

మార్టూరు : మార్టూరులో చెన్నకేశవస్వామి వారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనం ఇచ్చారు. అదేవిధంగా ఆంజనేయస్వామి రాతి విగ్రహం వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఇసుకదర్శి రోడ్డు వద్ద పాండురంగస్వామి దేవస్థానంలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

మేదరమెట్ల: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మేదరమెట్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఉదయం 10 గంటల సమయంలో సూమారు 300 మంది భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండలంలోని దైవాలరావూరు, రావినూతల, పమిడిపాడు, కుర్రవానిపాలెం, కోరిశపాడు, తమ్మవరం, యర్రబాలెం, బొడ్డువానిపాలెం తదితర గ్రామాలల్లో ని ఆలయాల్లో విశేష పూజలు చేశారు.

Updated Date - Dec 30 , 2025 | 11:26 PM