Share News

కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలి

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:37 AM

ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్క్‌ఫెడ్‌ జిల్లా డీఎం కరుణ అన్నారు. గురువారం మండల పరిధిలోని అడుసుమల్లి గ్రామంలో పీఏసీఎస్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్‌, నాఫెడ్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవపరాల కొనుగోలు కేంద్రాన్ని డీఎం ప్రారంభించారు.

కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలి
అపరాల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి కొనుగోలు చేస్తున్న మార్క్‌ఫెడ్‌ డీఎం కరణ, సిబ్బంది, రైతులు

మార్క్‌ఫెడ్‌ జిల్లా డీఎం కరుణ

అడుసుమల్లి (పర్చూరు), ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్క్‌ఫెడ్‌ జిల్లా డీఎం కరుణ అన్నారు. గురువారం మండల పరిధిలోని అడుసుమల్లి గ్రామంలో పీఏసీఎస్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్‌, నాఫెడ్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవపరాల కొనుగోలు కేంద్రాన్ని డీఎం ప్రారంభించారు. ఈసందర్భంగా రైతులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసేందుకే ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మినుము, శనగ, పెసలు వంటి అపరాలను ఈ-కేంద్రాల ద్వారా విక్రయించుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో అడుసుమల్లి పీఎసీఎస్‌ సీఇవో రమాదేవి, ఆర్‌బీకే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 12:37 AM