Share News

ప్రభుత్వ ఉచిత శిక్షణతో ఉపయోగం

ABN , Publish Date - May 04 , 2025 | 10:40 PM

ప్రభుత్వం నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నా రు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో శాప్‌, కోడి రామ్మూర్తి ఆరోగ్య క్రీడా సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రీడా, నట శిక్షణ శిబిరం ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు.

ప్రభుత్వ ఉచిత శిక్షణతో ఉపయోగం
వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కందుల

ఎమ్మెల్యే నారాయణరెడ్డి

మార్కాపురం వన్‌టౌన్‌, మే 4 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నా రు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో శాప్‌, కోడి రామ్మూర్తి ఆరోగ్య క్రీడా సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రీడా, నట శిక్షణ శిబిరం ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..శిక్షణ శిబిరాలు ప్రతి విద్యార్థి ఉపయోగించుకోవాలని, చదువుతోపాటు ఆటలు ఎంతో ముఖ్యం అన్నారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఏవో అశోక్‌రెడ్డి,

డాక్టర్‌ టి.సంజీవ్‌, రాష్ట్ర బాక్సింగ్‌ కోచ్‌ పి.వేణు, కోడి రామ్మూర్తి ఆరోగ్య క్రీడా సాంస్కృతిక సేవా సంఘం అధ్యక్షుడు పిన్నిక నాగేశ్వరరావు, కార్యదర్శి కాళంగి శ్రీనివాసులు, ఫుట్‌బాల్‌ కోచ్‌ ఉప్పు రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్‌ మాలపాటి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2025 | 10:40 PM