ఉచిత ప్రయాణంతో ఉరూరా సందడి
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:59 PM
ప్రజాప్రభుత్వం సూపర్‌సిక్స్ పథకాలలో భాగంగా అమలు చేసిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం అద్భుతంగా ఉందని మహిళలు ఊరూరా సందడి చేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ సాయంత్రం నుంచి ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. రెండో రోజు శనివారం మహిళలు ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా కూర్చుని ఉచితంగా ప్రయాణం చేస్తూ కనిపించారు.
సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్న మహిళలు
58 బస్సుల్లో ఉచిత ప్రయాణం
గిద్దలూరు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రభుత్వం సూపర్‌సిక్స్ పథకాలలో భాగంగా అమలు చేసిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం అద్భుతంగా ఉందని మహిళలు ఊరూరా సందడి చేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ సాయంత్రం నుంచి ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. రెండో రోజు శనివారం మహిళలు ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా కూర్చుని ఉచితంగా ప్రయాణం చేస్తూ కనిపించారు. గిద్దలూరు ఆర్టీసీ డిపో పరిధిలో గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారపేట, కంభం, అర్ధవీడు మండలాల్లోని దాదాపు అన్ని గ్రామాలకు బస్సు సర్వీసులను నడుపుతున్నారు. వాటితోపాటు నంద్యాల, మైదుకూరు, ఒంగోలు, మార్కాపురం తదితర పట్టణాలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులను నడుపుతున్నారు. డిపో పరిధిలో మొత్తం 69 బస్సులు ఉండగా ఇందులో 43 పల్లెవెలుగు, 15 ఎక్స్‌ప్రె్‌సలు కలిపి మొత్తం 58 సర్వీసులలో మహిళలను ఉచిత ప్రయాణానికి అనుమతించారు. కేవలం సెమిలగ్జరీ, అలా్ట్రడీలక్స్, హైటెక్ బస్సు సర్వీసులు విజయవాడ, చెన్నై, హైదరాబాద్‌కు నడుపుతుండగా ఈ 11 సర్వీసులు మినహా మిగతా 58 బస్సు సర్వీసులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తూ సంతోషంగా కనిపించారు. ఒంగోలు, తిరుపతి లాంటి ప్రధాన రూట్లలో కూడా ఉచిత బస్సు సర్వీసు మహిళలకు నేరుగా వెళ్లే వెసలుబాటు కలిగింది. శనివారం తిరుపతికి, నెమలిగుండ్ల రంగనాయకస్వామికి భక్తులు పెద్ద ఎత్తున వెళతారు. మహిళ భక్తులు ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఉచితంగా ఎలాంటి చార్జీలు లేకుండా ఆయా దేవస్థానాలకు వెళ్లి దర్శించుకుని తిరిగి రావడం కనిపించింది.
మహిళల్లో ఆనందోత్సాహం
త్రిపురాంతకం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : మహిళల్లో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం సూపర్‌సిక్స్ హామీల్లో భాగంగా అమల్లోకి తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకంతో (స్త్రీ శక్తి) ఎంతో ఉపయోగకరంగా ఉందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రగొండపాలెం బస్టాండ్‌లో పలువురు ప్రయాణికులు ఈ సందర్భంగా వారి ఆనందాన్ని అనుభూతిని చెప్పుకున్నారు. గురిజేపల్లికి చెందిన యువతి వసంతలక్ష్మి తొలిసారి తాను రూపాయి కూడా చెల్లించకుండా బస్సులో ప్రయాణించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు మార్కాపురం నుంచి మాచర్ల వెళుతున్న చంద్రకళ కూడా ఉచిత ప్రయాణం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తనచేతిలోని టికెట్‌ను చూపించారు. ఇలా మహిళలంతా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మహిళలకు ఆర్థిక చేయూతనిస్తున్నాయని, ముఖ్యమంత్రికి మా కృతజ్ఞతలని తెలిపారు. మొత్తానికి మొదటిరోజు బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని ఆర్టీసీ సిబ్బంది తెలిపారు.
సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు
వ్యక్తిగత పనిపై కొమరోలు నుంచి గిద్దలూరుకు వెళ్లేందుకు బస్సు ఎక్కాను. రూ.30 చార్జీకి బదులు ఉచిత టికెట్ కండక్టర్ ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు.
- జ్యోతి, కొమరోలు
సంతోషంగా ఉంది
ఆర్టీసీ బస్సులలో చార్జీ లేకుండా ఉచితంగా ప్రయాణించడం చాలా సంతోషంగా ఉంది. నమ్మలేకుండా ఉన్నాను. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు
- పార్వతి, గిద్దలూరు
డబ్బు ఆదా
ఉచిత బస్సు ప్రయాణం వలన డబ్బులు ఆదా అవుతాయి. ఈ డబ్బును దాచుకుని తమ కుటుంబ అవసరాల కోసం వాడుకుంటే బాగుంటుంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, ఇప్పుడు ఉచిత ప్రయాణం లాంటి పథకాలు మహిళలకు ఎంతో ప్రయోజనంగా ఉన్నాయి. సీఎం సార్‌కు కృతజ్ఞతలు.
- మెర్సీ, రాచర్ల ఫారం
సంతోషాన్నిచ్చింది
పేద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో ఆర్థిక కష్టాలు తీరినట్టే. అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు.
- ఒంటేరు సీతమ్మ, మర్రివేముల
స్ర్తీ శక్తితో చేయూత
ఉచిత బస్సుప్రయాణం పేద మహిళలకు ఆర్ధిక చేయూత. మా గ్రామం నుంచి వైపాలెంకు రాను పోను టికెట్ రూ.100 ఖర్చవుతుంది. ఉచిత బస్సు ప్రయాణంతో డబ్బులు ఆదా అవుతాయి. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.
- అన్నంగి నాగేంద్రమ్మ, మర్రివేముల
ఉచిత ప్రయాణంలో మహిళా చైతన్యం
70 శాతంపైగానే మహిళా ప్రయాణికులు
మార్కాపురంలో బస్సుల్లో 13 వేల మంది ప్రయాణం
మార్కాపురం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): సూపర్‌సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు. స్త్రీ శక్తి పథకం పేరున ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని మహిళలు పెద్దఎత్తున ఉపయోగించుకుంటున్నారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీలో 70 శాతానికి పైగానే మహిళా ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కీర్తిస్తున్నారు. ఒక్క మార్కాపురం డిపో నుంచే శనివారం 13 వేల మంది పైచిలుకు మహిళలు బ స్సుల్లో ఉచిత ప్రయాణం చేశారు. శుక్రవారం 485 మంది ప్రయాణం సాగించారు. మార్కాపురం డిపో ఉన్న 106 బస్సుల్లో రోజుకు 25 వేల మంది ప్రయాణికులు పలు రూట్లలో గమ్యస్థానాలకు రాకపోకలు సాగిస్తుంటారు. మహిళలకు కేవలం పల్లెవెలుగు, అలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే ప్రయాణానికి ప్రభుత్వం అనుమతించింది. అయి నా ఉన్న కొద్దిపాటి బస్సుల్లో కూడా మహిళా ప్రయాణికులే సుమారు 70 శాతం పైగా ప్రయాణించారు. ముఖ్యంగా శుభకార్యాలు ఎక్కువగా ఉండడంతో మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు.