Share News

రైతులకు అందుబాటులో యూరియా

ABN , Publish Date - Aug 25 , 2025 | 11:51 PM

జిల్లాలో సాగుకు అవసరమైన స్థాయిలో యూరియాను అందుబాటులో ఉంచుతున్నట్లు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.

రైతులకు అందుబాటులో యూరియా
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ అన్సారియా

మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు

కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

ఒంగోలు కలెక్టరేట్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో సాగుకు అవసరమైన స్థాయిలో యూరియాను అందుబాటులో ఉంచుతున్నట్లు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం సాయంత్రం మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందన్నారు. ఆర్‌ఎ్‌సకే స్థాయిలో ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. యూరియాలో 70శాం ఆర్‌ఎ్‌సకేలకు, 30శాతంప్రైవేటు షాపులకు ఇస్తున్నట్లు తెలిపారు. సబ్సిడీపై అందించే యూరియాను ఇతర అవసరాలకు వినియోగించినా, కొరత ఉందని పుకార్లు పుట్టించినా, అక్రమంగా నిల్వ ఉంచినా, అధిక ధరలకు విక్రయించినా సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్‌ఎ్‌సకేలు, ప్రైవేటు షాపులను తనిఖీ చేసేందుకు రెవెన్యూ, పోలీస్‌, వ్యవసాయశాఖ అధికారులతో మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీలు మంగళవారం నుంచి విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే వాననీటిని భూమిలోకి ఇంకింప చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ దిశగా గ్రామాల వారీగా నీటి సంరక్షణ ప్రణాలికలు రూపొందించాలన్నారు. భూగర్భనీటిమట్టాన్ని పెంచేందుకు తొలుత ఇంకుడు గుంతల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుతెలిపారు. అనంతరం పలు అంశాలపై కలెక్టర్‌ మండల స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ, డీఆర్వో చినఓబులేషు, వివిధ శాఖల అధికారులు వరలక్ష్మీ, చిరంజీవి, జోసె్‌ఫకుమార్‌, శ్రీనివాసరావు, హరికృష్ణ, బాలశంకరరావు, గోపిచంద్‌, డాక్టర్‌ టి. వెంకటేశ్వర్లు, నారాయణ ఉన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 11:51 PM