ప్రారంభానికి నోచుకోని భవనాలు
ABN , Publish Date - Jun 16 , 2025 | 10:40 PM
వైసీపీ పాలనలో అర్భాటకంగా కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ భవనాలు ఎందుకూ పనికిరాకుండా నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో కోట్ల రూపాయాల ప్రజా ధనం వృథా అయ్యాయి.
నిరుపయోగంగా మారిన వైనం
లక్షల రూపాయలు వృథా
బేస్తవారపేట, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ పాలనలో అర్భాటకంగా కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ భవనాలు ఎందుకూ పనికిరాకుండా నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో కోట్ల రూపాయాల ప్రజా ధనం వృథా అయ్యాయి. బేస్తవారపేట పట్టణంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రానికి రూ.21.50 లక్షలు, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం కోసం రూ.17.50 లక్షలు నిధులతో భవనాలు నిర్మించారు. కాంట్రాక్టర్‌లకు బిల్లులు వచ్చాయి. కానీ ఆ ప్రభుత్వ భవనాలు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో భవనాల చుట్టూ చిల్ల కంప పెరిగి నిరుపయోగంగా మారుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ భవనాలను ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రనజలు కోరుతున్నారు.