గుండ్లకమ్మలో యథేచ్ఛగా ఇసుక తవ్వకం
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:52 AM
గుండ్లకమ్మ నదికి ఇటీవల వచ్చిన వరదలతో ఇసుక చేరింది. దీంతో అక్రమార్కులు ఇసుక రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు.
అద్దంకి, డిసెంబరు21 (ఆంధ్రజ్యోతి): గుండ్లకమ్మ నదికి ఇటీవల వచ్చిన వరదలతో ఇసుక చేరింది. దీంతో అక్రమార్కులు ఇసుక రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు. గతంలో పలు సందర్భాలలో గుండ్లకమ్మ నదిలో బ్రిడ్జి, ఊటబావులు, ఎత్తిపోతల పథకాల సమీపంలో ఇసుకవ తవ్వకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. దీంతో కొంతకాలం పాటు ఆయా నిషేధిత ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతా లలో ఇసుక తవ్వకాలు జరిగాయి. వైసీపీ ప్రభుత్వంలో నిషేధిత ప్రాంతాలలో సైతం అడ్డగోలుగా పెద్ద పెద్ద గోతులు పెట్టి ఇసుక తవ్వకాలు చేపట్టారు. అయితే ఇటీవల వరద లకు నాణ్యమైన ఇసుక అప్పట్లో ఇసుక తోలిన గోతులలోకి వచ్చి చేరింది. దీంతో పలువురు ఈ ఇసుకను సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అధికారు లు సైతం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమ ర్శలు వస్తున్నాయి. ఇటీవల రామాయ పాలెం సమీపంలో ఊటబావుల వద్ద ఇసుక తవ్వ కాలు జరుగు తుండటంతో గ్రామస్థులు ఫిర్యా దు చేయడంతో అధికారులు నిలిపి వేయించ ారు. అయితే ఇప్పుడు ఏకంగా గుండ్లకమ్మ వంతెన శ్మశా నం మధ్యలో ఉన్న ప్రాంతంలో ఏకంగా ఎస్కకవేటర్‌లు ఏర్పాటు చేసి మూడు రోజులు గా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఇదే విధంగా తవ్వకాలు చేస్తే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారులు స్పందిం చి నిషేధిత ప్రాంతాలలో ఇసుక తవ్వకాలు జరగకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.