Share News

సీసీఎస్‌ స్టేషన్‌ నుంచి ఇద్దరు దొంగలు పరారీ

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:07 PM

ఒంగోలు సీసీఎస్‌ పోలీసు స్టేషన్‌ నుంచి ఇద్దరు దొంగలు పరారయ్యారు. అందులో ఒక మోస్ట్‌ వాంటెడ్‌ ఉన్నాడు.

సీసీఎస్‌ స్టేషన్‌ నుంచి   ఇద్దరు దొంగలు పరారీ

వారిలో ఒకరు మోస్ట్‌వాంటెడ్‌

ఒంగోలు క్రైం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు సీసీఎస్‌ పోలీసు స్టేషన్‌ నుంచి ఇద్దరు దొంగలు పరారయ్యారు. అందులో ఒక మోస్ట్‌ వాంటెడ్‌ ఉన్నాడు. వివరాల్లోకి వెళితే.. నగరంలో అనేక దొంగతనాలు, దోపిడీలకు పాల్పడిన నాగూర్‌తోపాటు మోటారు సైకిళ్ల దొంగ అయిన అస్కర్‌ను రెండు రోజుల క్రితం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సీసీఎస్‌ పోలీసులకు అప్పగించారు. ఒంగోలు సీసీఎస్‌ పోలీసు స్టేషన్‌లో ఉన్న ఇద్దరు దొంగలు ఆదివారం అక్కడి సెంట్రీ కళ్లుకప్పి పరారయ్యారు. వీరిలో నాగూర్‌ గతంలో పలు దొంగతనాలు, దోపిడీల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇరువురూ కలిసి ఇటీవల ఐదు మోటారు సైకిళ్లను దొంగిలించినట్లు తెలిసింది. వాటిని సీసీఎస్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పరారైన ఇద్దరు దొంగల కోసం సీసీఎస్‌ పోలీసులతోపాటు, ఐడీ పార్టీ పోలీసులు గాలింపు చేపట్టారు.

Updated Date - Nov 23 , 2025 | 11:07 PM