ఇద్దరు మండల సర్వేయర్లు సస్పెన్షన్
ABN , Publish Date - Aug 12 , 2025 | 01:41 AM
ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా కేటాయించిన స్థానాల్లో విధు ల్లో చేరకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు మండల సర్వేయర్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు సీసీఎల్‌ఏ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
13 మంది సీనియర్ అసిస్టెంట్లకు రివర్షన్
ఒంగోలు కలెక్టరేట్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా కేటాయించిన స్థానాల్లో విధు ల్లో చేరకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు మండల సర్వేయర్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు సీసీఎల్‌ఏ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఒంగోలు రూరల్ సర్వేయర్ విష్ణువర్థన్‌ను జరుగుమల్లి, అక్కడ పనిచేస్తున్న సర్వేయర్ బాబూరావును ఒంగోలు రూరల్ మండల సర్వేయర్‌గా నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఇరువురు సర్వేయర్లు విధుల్లో చేరలేదు. ఈ విషయం సీసీఎల్‌ఏ దృష్టికి చేరింది. దీంతో ఆ ఇద్దరిపై ఆయన చర్యలు తీసుకున్నారు.
డిపార్ట్‌మెంట్ పరీక్షలు పాసు కాకపోవడంతో..
జిల్లాలోని రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 13 మంది సీనియర్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకుంటూ కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో)గా పనిచేస్తున్న 13 మందికి 2022లో సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి లభించింది. అయితే ప్రమోషన్ పొందిన వారు సర్వే శిక్షణతోపాటు డిపార్ట్‌మెంట్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో 13మందిని వీఆర్వోలుగా రివర్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.