Share News

గీత కార్మికులకు రెండు బార్లు

ABN , Publish Date - Aug 20 , 2025 | 10:55 PM

మార్కాపురం పట్టణంలో గీత కార్మికుల కోసం ఎక్సైజ్‌ శాఖ రెండు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు కేటాయించినట్లు సీఐ ఎం.వెంకటరెడ్డి అన్నారు.

గీత కార్మికులకు రెండు బార్లు

26లోపు దరఖాస్తు చేసుకోవాలి : ఎక్సైజ్‌ సీఐ వెంకటరెడ్డి

మార్కాపురం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం పట్టణంలో గీత కార్మికుల కోసం ఎక్సైజ్‌ శాఖ రెండు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు కేటాయించినట్లు సీఐ ఎం.వెంకటరెడ్డి అన్నారు. ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో బుధవారం గీత కార్మికులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఐదు బార్‌లకు జనరల్‌ కేటగిరీలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరో రెండు బార్లను గీత కార్మికుల కోసం ఇక్కడకు కేటాయించారన్నారు. ఈ బార్లకు దరఖాస్తు చేసుకునే వాళ్లు రూ.5లక్షల నాన్‌ రిఫండబుల్‌ ఫీజుతోపాటు మరో రూ.10వేలు ప్రాసెసింగ్‌ ఫీజును చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈ నెల 30న జిల్లా కలెక్టర్‌ లాటరీ ద్వారా బార్లు కేటాయిస్తారన్నారు. గీత కార్మికులకు సంబందించిన బార్లకు లైసెన్స్‌కు సంవత్సరానికి రూ.27.50లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మూడు సంవత్సరాలపాటు ఈ లైసెన్స్‌ రెన్యువల్‌ అవుతూనే ఉంటుందన్నారు. గీత కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసునకుని దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఎస్సై గోపాలకృష్ణ, సిబ్బంది. గీత కార్మికులు, వ్యాపారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2025 | 10:55 PM