Share News

జిల్లాకు రెండు అవార్డులు

ABN , Publish Date - Nov 11 , 2025 | 01:46 AM

జిల్లాలో డ్వామా పర్యవేక్షణలో జరుగుతున్న వాటర్‌ షెడ్‌ పనుల అమలులో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు రెండు అవార్డులు లభించాయి. దేశవ్యాప్తంగా వాటర్‌షెడ్‌ పనులు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున జరుగుతున్నాయి

జిల్లాకు రెండు అవార్డులు

నేడు గుంటూరు సదస్సులో ప్రదానం

ఒంగోలు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో డ్వామా పర్యవేక్షణలో జరుగుతున్న వాటర్‌ షెడ్‌ పనుల అమలులో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు రెండు అవార్డులు లభించాయి. దేశవ్యాప్తంగా వాటర్‌షెడ్‌ పనులు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున జరుగుతున్నాయి. వాటిపై సమీక్ష కోసం సోమ, మంగళవారాల్లో గుంటూరులో జాతీయ స్థాయి సదస్సును కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహిస్తోంది. ఈ పనులలో మంచి ఫలితాలు సాధించిన వాటర్‌ షెడ్‌లకు జనభగీధారి పేరుతో అవార్డులను ఇస్తున్నారు. అలా రాష్ట్రంలో ఏడు వాటర్‌షెడ్‌లకు అవార్డులు లభించగా వాటిలో జిల్లాకు రెండు దక్కాయి. మారెళ్ల, తువ్వపాడు వాటర్‌షెడ్లకు ఈ అవార్డులు వచ్చాయి. మంగళవారం గుంటూరు సదస్సులో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. జిల్లా నుంచి ఈ అవార్డులు అందుకునేందుకు డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌ హాజరుకానున్నారు.

Updated Date - Nov 11 , 2025 | 01:46 AM