Share News

డాక్టర్‌ రవ్రీందకు సన్మానం

ABN , Publish Date - May 26 , 2025 | 11:24 PM

వెనుకబడిన ఎర్రగొండపాలెం ఏరియాలో పేద ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించిన డాక్టర్‌ మన్నె రవీంద్రకు వీసా హెల్త్‌ కేర్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు వచ్చిన సందర్భంగా నియోజకవర్గ కాకతీయ కమ్మ సేవా సంఘం తరపున అభినందిస్తున్నామని అధ్యక్షుడు కూచిపూడి కోటయ్య అన్నారు.

డాక్టర్‌ రవ్రీందకు సన్మానం
డాక్టర్‌ మన్నెను సన్మానిస్తున్న కాకతీయ సేవా సంఘం నాయకులు

ఎర్రగొండపాలెం, మే 26 (ఆంధ్రజ్యోతి) : వెనుకబడిన ఎర్రగొండపాలెం ఏరియాలో పేద ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించిన డాక్టర్‌ మన్నె రవీంద్రకు వీసా హెల్త్‌ కేర్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు వచ్చిన సందర్భంగా నియోజకవర్గ కాకతీయ కమ్మ సేవా సంఘం తరపున అభినందిస్తున్నామని అధ్యక్షుడు కూచిపూడి కోటయ్య అన్నారు. ఎర్రగొండపాలెం కాకతీయ సేవా సంఘం కార్యాలయంలో సోమవారం జరిగిన డాక్టర్‌ రవీంద్ర సన్మాన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మన్నెకు దుశ్శాలవా, పూలమాలతో సన్మానించారు. ఆయనకు వచ్చిన అవార్డు, ప్రశంసాపత్రం ఫొటో ఫ్రేంను బహూకరించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ చేకూరి ఆంజనేయులు, కాకతీయ కమ్మ సేవా సంఘం నాయకులు ఏ రామచంద్రరావు, వడ్లమూడి లింగయ్య, కందిమళ్ల శ్రీనివాసరావు, మల్లిపెద్ది రవీంద్రబాబు, మల్లికార్జున, మాదాల శేషయ్య, కాకర్ల కోటయ్య, కోండ్రు ఆంజనేయులు, వూట్ల సీతారామయ్య, సాంబశివరావు, సత్యనారాయణ, కోటేశ్వరరావు, సుబ్బారావు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2025 | 11:24 PM