మానవాళి మనుగడకు చెట్లే జీవనాధారం
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:06 AM
మానవాళి మనుగడకు చెట్లే జీవనాధారమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. మార్కెట్ యార్డులో, మండలంలోని భూపతిపల్లిగ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంలో గురువారం అధికారులు, నాయకులతో కలిసి మొక్కలను నాటారు.
వన మహోత్సవంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి
హరితాంధ్ర కోసం అడుగేద్దాం : ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్ : టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు
మార్కాపురం రూరల్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి) : మానవాళి మనుగడకు చెట్లే జీవనాధారమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. మార్కెట్ యార్డులో, మండలంలోని భూపతిపల్లిగ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంలో గురువారం అధికారులు, నాయకులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స ఏపీవో నాగరాజు, టీడీపీ నాయకులు మాలపాటి వెంకటరెడ్డి, మౌలాలి, మున్సిపల్ కౌన్సిలర్ నాలి కొండయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గిద్దలూరు టౌన్ : హరితాంధ్ర సాధన కోసం అడుగులు వేద్దామన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రడ్డి అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో వన మహోత్సవాన్ని నిర్వహించారు. ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేయాలన్నారు. నాటిన మొక్కను పెరిగే వరకు ప్రతి ఒక్కరూ పర్యవేక్షించాలని అశోక్‌రెడ్డి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంకటసుబ్బయ్య, అటవీశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ నిషాకుమారి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, జడ్పీటీసీ సభ్యుడు మధుసూదన్, మార్కెట్‌యార్డు చైర్మన్ బాలయ్య, సొసైటీ బ్యాంక్ చైర్మన్ బాలీశ్వరయ్య, సయ్యద్ షాన్షావలి, సుబ్బారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
పెద్దారవీడు : పర్యావరణ పరిరక్షణతో భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుందని టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. స్థానిక కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యత అన్నా రు. వృక్ష సంపద ఎక్కడ సంవృద్ధిగా ఉంటే అక్కడ నాగరికత అభివృద్ధి చెందుతాయన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని అందరూ నిరోధించుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు ఏలూరి రామచంద్రారెడ్డి, టీడీపీ మండలాధ్యక్షుడు మెట్టు శ్రీనివాసులరెడ్డి, ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స ఏపీడీ నిర్మలాదేవి, ఎంపీడీవో జాన్‌సుందరం, ఏపీవో సుజాత, టీడీపీ నాయకులు గొట్టం శ్రీనివాసులరెడ్డి, రామ నారాయణరెడ్డి, చంద్రగుంట్ల నాగేశ్వరరావు, పాల్గొన్నారు.
ఎర్రగొండపాలెం రూరల్ : నియోజకవర్గంలో లక్ష మొక్కలు నాటి వాటిని కాపాడి పర్యవరణాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ప్రపంచ పర్యవరణ దినోత్సవం, వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల ప్రాంగణంలో అటవీ శాఖ అధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఎరిక్షన్‌బాబు పాల్గొన్నారు. అటవీశాఖ అధికారి ఎస్‌వీ సుబ్బారావు అధ్యక్షత వహించి మాట్లాడారు. అనంతరం వైద్యశాల ప్రాంగణంలో అధికారులు, నాయకులు, ఎన్‌సీసీ విద్యార్థులతో కలిసి అతిథులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యాదాద్రిదేవర, ఎంపీడీవో బండారు శ్రీనివాసులు, ఏపీవో శైలజ, పట్టణ అధ్యక్షుడు పెరుమాళ్ల మల్లికార్జున రావు, టీడీపీ నాయకులు సత్యనారాయణ గౌడ్, ఎంసీహెచ్ మంత్రునాయక్, చిట్యాల వెంగళ రెడ్డి, శనగ నారాయణ రెడ్డి, సుబ్బారెడ్డి, క్లస్టర్ ఇన్‌చార్జీ మస్తాన్ వలి, రాములు, వైద్యశాల, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
మార్కాపురం వన్‌టౌన్ : మొక్కలు నాటి బాధ్యతగా పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలని వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేసు వెంకట ప్రసాద్ అన్నారు. పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని వాసవీ విజన్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం బాలుర ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పూర్ణ చంద్రరావు, కిశోర్ బాబు, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, రామారావు, హర్షిత, శ్రీకృష్ణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పెద్ద దోర్నాల : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని రేంజి అధికారి జీవన్‌కుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖా ఆధ్వర్యంలో గణపతి చెక్‌పోస్టు వద్ద దోర్నాల రేంజి అధికారి జీవన్‌కుమార్ గురువారం మొక్కలు నాటారు. జీవరాశి మనుగడ పర్యావరణ పరిరక్షణతోనే సవ్యంగాసాగుతుందని జీవన్‌కమార్ అన్నారు.
కంభం, జూన్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం బాలికోన్నత పాఠశాలలో ఎంపీడీవో వీరభద్రాచారి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఎంఈవోలు మాల్యాద్రి, శ్రీనివాసులు, అబ్దుల్ సత్తార్, హెచ్‌ఎం అమూల్య, వెంకటేశ్వర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ చిన్ని, పద్మావతిదేవి పాల్గొన్నారు.
గిద్దలూరు : ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకుని పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని బీజేపీ నా యకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జేవీ నారాయణ, జిల్లాశాఖ ఉపాధ్యక్షుడు బీవీ రామాంజనేయులు, కేవీ చంద్రమోహన్, పుల్లయ్య, సాయిచరణ్, నాగేశ్వరరావు, ప్రవీణ్‌గౌడ్, పాఠశాల ప్రిన్సిపాల్ శ్వేత పాల్గొన్నారు. పాతాళ నాగేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలో కిసాన్ మోర్చా నాయకుడు పిడతల రమే్‌షరెడ్డి, ఓబీసీ మోర్చా నాయకులు బాదుల్లా, నరసింహులు, విజయలక్ష్మి మొక్కలు నాటారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అధికారులు 50 మొక్కలు నాటారు. నిత్యం వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని డిపో మేనేజర్ చంద్రశేఖర్ సిబ్బందికి సూచించారు. గ్యారేజ్ ఇన్‌చార్జి గురువయ్య, ట్రాఫిక్ ఇన్‌చార్జి మౌనిక పాల్గొన్నారు.
రాచర్ల : మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామని బంగారు బాల్యం జిల్లా నోడల్ అధికారి వి.గిరిధరశర్మ, ఎంపీడీవో ఎస్.వెంకటరామిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ షేక్ ఖాశింభీ, తహసీల్దార్ ఎల్.వెంకటేశ్వర్లు, ఈవోఆర్డీ ఐ.వెంకటేష్, కార్యాలయ ఏవో కుమార్, ఎస్సై పి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.
పుల్లలచెరువు : విజయ వాహిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుద్దకురువ తాండాలో మొక్కలు నాటారు.