Share News

ఈ రోడ్డులో ప్రయాణం అంటే హడలే

ABN , Publish Date - Aug 15 , 2025 | 01:53 AM

మండల పరిధిలోని బల్లికురవ మార్టూరు ఆర్‌అండ్‌బీ రోడ్డులో ప్రయాణం అంటే ప్రయా ణికులు హడలి పోతున్నారు.

ఈ రోడ్డులో ప్రయాణం అంటే హడలే

బల్లికురవ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని బల్లికురవ మార్టూరు ఆర్‌అండ్‌బీ రోడ్డులో ప్రయాణం అంటే ప్రయా ణికులు హడలి పోతున్నారు. ఈ రోడ్డున కొత్త వ్యక్తులు ఎవరైన వస్తే గోతులలో ఉన్న వర్షపు నీటిలో పడి ప్రమాదాల బారిన పడుతు న్నారు. అడుగడుగుకు మోకాటి లోతు గోతు లు ఉండడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే గోతుల వద్ద ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో పొస్టులు చేస్తు న్నారు. అధికా రులు, ప్రభుత్వం వెంటనే స్పందించి మర మ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

బల్లికురవ నుంచి వయా నాగరాజుపల్లి మీదుగా వెళ్లే మార్టురు రోడ్డు 10 కిలోమీటర్ల ఉంది. ఈ రోడ్డును గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఆరు కిలోమీటర్ల మేర డబుల్‌ రోడ్డుగా అభివృద్ధి పరిచారు. అనం తరం ఏడేళ్ల నుంచి మిగిలిన ఆ నాలుగు కిలో మీటర్ల మేర ఉన్న రోడ్డు గురించి ఎవరూ పట్టించుకో వడం లేదు. దీంతో రోడ్డు మొత్తం గోతలమయ మైంది. నిత్యం వందల గ్రానైట్‌ లారీలు ముడిరాయిని తీసు కుని గ్రానైట్‌ ఫ్యాక్టరీలకు ఈ రోడ్డున రాకపోకలు సాగిస్తు న్నాయి. ఈ గోతుల్లో పడి నిత్యం ఏదో ఒక లారీ బోల్తా పడుతోంది. ఇక ఆటోలలో ప్రయాణించే వారు, నిత్యం పాఠశాలకు బస్సుల్లో వెళ్లే వారు మరింత ఆందోళన చెందుతున్నారు. ఎదైన ప్రమాదం సంభవిస్తే విద్యార్ధుల ప్రాణాల కు ముప్పు పొంచి ఉందని పేర్కొంటున్నారు. వర్షాకాలంలో సమస్య మరింత తీవ్రంగా ఉంటోందని ఇప్పటికైనా అధికా రులు స్పందించి రోడ్డు అభి వృద్ధికి నిధులు మంజూరయ్యే వరకు పెద్ద గోతుల మరమ్మతు లు అయిన చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 15 , 2025 | 01:53 AM