చిరుత ఆచూకీ కోసం ట్రాప్ కెమెరాలు
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:21 AM
మండలంలోని ఇమ్మడిచెరువు, రాళ్లపల్లి గ్రామాల పరిధిలో చిరుత పులి సంచరిస్తున్నట్లు తెలుసుకున్న అటవీశాఖ అధికారులు దాని ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. చిరుత సంచరిస్తూ.. రైతులకు కనిపించిన ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారి సూచన
వెలిగండ్ల, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఇమ్మడిచెరువు, రాళ్లపల్లి గ్రామాల పరిధిలో చిరుత పులి సంచరిస్తున్నట్లు తెలుసుకున్న అటవీశాఖ అధికారులు దాని ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. చిరుత సంచరిస్తూ.. రైతులకు కనిపించిన ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అనుమానిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి ఉమామహేశ్వరరెడ్డి మాట్లాడుతూ చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అది కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ పాల్గొన్నారు.