సహకార శాఖలో బదిలీలు
ABN , Publish Date - Jun 11 , 2025 | 01:17 AM
సహకార శాఖలో పలువురు అధికారులు బదిలీ అయ్యారు. ఈమేరకు రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా సహకార ఆడిట్ అధికారి (డీసీఏవో)గా పనిచేస్తున్న పోలిశెట్టి రాజశేఖర్‌ను కావలి డివిజనల్ సహకారాధికారిగా బదిలీ చేశారు.
డీసీఏవోగా రవిరాజశేఖర్
ఒంగోలు విద్య, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): సహకార శాఖలో పలువురు అధికారులు బదిలీ అయ్యారు. ఈమేరకు రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా సహకార ఆడిట్ అధికారి (డీసీఏవో)గా పనిచేస్తున్న పోలిశెట్టి రాజశేఖర్‌ను కావలి డివిజనల్ సహకారాధికారిగా బదిలీ చేశారు. నెల్లూరు జిల్లా గుడూరు డివిజనల్ సహకారాధికారిగా పనిచేస్తున్న జి.రవిరాజశేఖర్‌ను ఇక్కడ డీసీఏవోగా నియమించారు. ఒంగోలు డివిజనల్ సహకారాధికారిగా పల్నాడు జిల్లా సహకార అడిట్ అధికారిగా పనిచేస్తున్న డి. శ్రీనివాసరావును నియమించారు. ఇక్కడ డీసీఏవోగా పనిచేస్తున్న పి.రాజశేఖర్ ఒంగోలు డివిజనల్ సహకారాధికారిగా కూడా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పి.రాజశేఖర్ మంగళవారం ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. డీసీఏవోగా రవి రాజశేఖర్, ఒంగోలు డీఎల్‌సీఏగా శ్రీనివాసరావులు బాధ్యతలు స్వీకరించారు. సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పనిచేస్తున్న పలువురు అధికారులు కూడా బదిలీ అయ్యారు. వినుకొండ ఎస్‌డీఏకేసీవోగా పనిచేస్తున్న ఎన్.సురేంద్రబాబును ఒంగోలు ఎస్‌డీఎల్‌సీవోగా నియమించారు అద్దంకి ఎస్‌డీఎల్‌సీవోగా పనిచేస్తున్న ఎల్.సుధాకరరావును చీరాలకు బదిలీ చేశారు. కందుకూరు ఎస్‌డీఎల్‌సీవోగా పనిచేస్తున్న వేణుగోపాలరావును ఒంగోలు జిల్లా సహకారాధికారి కార్యాలయానికి స్థానచలనం కల్పించారు. గిద్దలూరు ఎస్‌డీఎల్‌సీవోగా పనిచేస్తున్న జి.వీరప్రసాద్‌ను మార్కాపురానికి బదిలీ చేశారు. పలువురు సీనియర్ ఇన్‌స్పెక్టర్లు కూడా బదిలీ అయిన వారిలో ఉన్నారు. దర్శి ఎస్‌డీఎల్‌సీవో కార్యాలయంలో పనిచేస్తున్న జీవీ.ప్రసాదరావును బాపట్లకు, అద్దంకిలో పనిచేస్తున్న వై.వెంకటేశ్వరరావును దర్శికి, బి.మాధురిని ఒంగోలు నుంచి కందుకూరు, అద్దంకిలో పనిచేస్తున్న టి.శ్రీనివాసులును ఒంగోలుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.