Share News

టీచర్లకు శిక్షణ

ABN , Publish Date - Sep 28 , 2025 | 02:50 AM

ఉమ్మడి జిల్లాలో మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులు సాధించిన కొత్త టీచర్లకు నాలుగు కేంద్రాల్లో ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, చెంచు పాఠశాలల్లో 672 పోస్టులు డీఎస్సీలో ప్రకటించగా 661 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు.

 టీచర్లకు శిక్షణ

నాలుగు కేంద్రాల్లో ఏర్పాటు

10న పాఠశాలలకు కేటాయింపు

13 నుంచి విధులకు హాజరుకావాలి

ఒంగోలు విద్య, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులు సాధించిన కొత్త టీచర్లకు నాలుగు కేంద్రాల్లో ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, చెంచు పాఠశాలల్లో 672 పోస్టులు డీఎస్సీలో ప్రకటించగా 661 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. మిగిలిన 11 అర్హులైన వారు రాక మిగిలిపోయాయి. కొత్త టీచర్లను విద్యాబోధనలో ప్రావీణ్యం కలిగి ఉండేలా తయారు చేయడం లక్ష్యంగా ఈ శిక్షణ ఇస్తున్నారు. అక్టోబరు 3 నుంచి 10 వరకు రెసిడెన్షియల్‌ విధానంలో ఇది కొనసాగనుంది. చివరి రోజున కౌన్సెలింగ్‌ నిర్వహించి పాఠశా లలు కేటాయించి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. వీరికి మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా స్థానాలు కేటాయి స్తారు. ఆయా పోస్ట్లుకు సంబంధించి ఖాళీలు ఎన్ని ఉన్న ప్పటికీ అభ్యర్థుల సంఖ్యకు సమానంగానే ప్రకటిస్తారు. వీరిని నాలుగు, మూడు కేటగిరీ పాఠశాలల్లోనే నియమి స్తారు. 10న కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక నియామక ఉత్తర్వులు ఇస్తారు. 13న వీరు కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. డీఎస్సీలో టీచర్‌ పోస్టులు సాధించిన వారు తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు ఆదేశాలు జారీచేశారు.

శిక్షణ ఎవరికి ఎక్కడంటే?

పొదిలిలోని ఒంగోలు రోడ్డులో ఉన్న సెయింట్‌ మేరీ బీఈడీ కళాశాలలో స్కూలు అసిస్టెంట్‌ తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్తూ టీచర్లకు టీచర్లకు శిక్షణ ఉంటుంది.

చీరాల రామాపురంలోని చీరాల ఇంజనీరింగ్‌ కళాశాలలో స్కూలు అసిస్టెంట్లు జీవశాస్త్రం, గణితం, ఫిజికల్‌ సైన్స్‌ వారికి శిక్షణ ఇస్తారు.

చీరాల ఎన్‌టీఆర్‌ నగర్‌లోని వీఆర్‌ఎస్‌ అండ్‌ వైఆర్‌ఎన్‌ కళాశాలలో స్కూలు అసిస్టెంట్లు వ్యాయామ విద్య, సాంఘిక శాస్త్రం టీచర్లకు ట్రైనింగ్‌ ఉంటుంది.

కనిగిరి మాచవరంలోని ఆల్ఫా ఆగ్రికల్చరల్‌ కళాశాలలో సెకండరీ గ్రేడ్‌ తెలుగు, ఉర్దూ టీచర్లకు శిక్షణ ఇస్తారు.

Updated Date - Sep 28 , 2025 | 02:50 AM