రేపటి నుంచి కొత్త టీచర్లకు శిక్షణ
ABN , Publish Date - Oct 02 , 2025 | 02:17 AM
మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన 661 మందికి జిల్లాస్థాయి ప్రాథమిక శిక్షణ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. వారికి ప్రభుత్వం ఇప్పటికే నియామక పత్రాలు జారీ చేసింది. నాలుగు కేంద్రాల్లో శిక్షణకు ఏర్పాట్లు చేశారు.
9,10 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్
661 మందికి శిక్షణ
ఒంగోలు విద్య, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన 661 మందికి జిల్లాస్థాయి ప్రాథమిక శిక్షణ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. వారికి ప్రభుత్వం ఇప్పటికే నియామక పత్రాలు జారీ చేసింది. నాలుగు కేంద్రాల్లో శిక్షణకు ఏర్పాట్లు చేశారు. పొదిలిలోని సెయింట్ మేరీ బీఈడీ కళాశాలలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ టీచర్లకు, చీరాలలోని చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో స్కూల్ అసిస్టెంట్ పీఎస్, బీఎస్, గణితం టీచర్లకు శిక్షణ ఇస్తారు. చీరాల వీఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్ కాలేజీలో స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ విద్య, సోషల్ టీచర్లకు, కనిగిరి ఆల్ఫా అగ్రికల్చర్ కళాశాలలో సెకండరీ గ్రేడ్ తెలుగు, ఉర్దూ టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. 3నుంచి 10వతేదీ వరకు ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ఈనెల 9,10 తేదీల్లో కొత్త టీచర్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పాఠశాలలు కేటాయించి పోస్టింగ్ ఉత్తర్వులు ఇస్తారు.