Share News

ఇటుక బట్టీలకు గడ్డుకాలం..

ABN , Publish Date - Dec 03 , 2025 | 01:21 AM

ఇటుకబట్టీ పరి శ్రమకు గడ్డుకాలం ఏర్పడింది. దశాబ్దకాలం క్రితం అద్దంకి ప్రాంతంలో 100కు పైగా ఇటుక బట్టీలు ఉన్నాయి.

ఇటుక బట్టీలకు గడ్డుకాలం..

అద్దంకి, డిసెంబరు2 (ఆంధ్రజ్యోతి): ఇటుకబట్టీ పరి శ్రమకు గడ్డుకాలం ఏర్పడింది. దశాబ్దకాలం క్రితం అద్దంకి ప్రాంతంలో 100కు పైగా ఇటుక బట్టీలు ఉన్నాయి. ప్రస్తుతం 50 ఇటుక బట్టీలు కూడా లేని పరిస్థితి. ఇటీవల వరకు 60 వరకు ఇటుకబట్టీలు ఉన్నా యి. గత ఏడాది చవిచూసిన నష్టాలతో 10 మంది వరకు ఇటుక తయారీ విరవించుకున్నారు. ఇటుక తయారీ ముమ్మరంగా చేయాల్సిన సమయంలో పలువురు బట్టీల నిర్వహకులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. గతంలో అద్దంకి ప్రాంతం ఇటుక రెండు తెలుగు రాష్ర్టాలలోని పలు ప్రాంతాలకు ఎగుమత య్యేది. ప్రస్తుతం కూడా పలు ప్రాంతాలకు ఎగుమతి జరుగుతున్నా.., ఆశించిన స్థాయిలో లేదు. అదే సమయంలో స్థానికంగా కూడా వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో తయారైన ఇటుకను తగ్గింపు

ధరలకే అమ్మకాలు చేస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరి నెలలో వెయ్యి ఇటుకలు ధర రూ.7 వేల నుండి రూ.7,200 వరకు ఉంది. ప్రస్తుతం వెయ్యి ఇటుకల ధర రూ.5,500 నుంచి రూ.6 వేల వరకు పడిపోయింది. వెయ్యి ఇటుక తయారీకి అన్ని ఖర్చులు కలిపి రూ.6,500 అవుతుంది. దీనికి తోడు కూలీలకు, తయారీ కి వినియోగించే వివిధ సామగ్రికి ముందుగానే డబ్బులు చెల్లించాల్సి రావడం మరింత భారంగా మారిందని ఇటుక బట్టీల యజమానులు వాపోతు న్నారు. నవంబరు మొదటివారం నుంచే ఇటుక తయారీ ముమ్మరంగా చేపట్టాల్సి ఉండగా, ఈ ఏడాది నవంబరు నెల చివర నాటికి కూడా తయారీ పనులు అంతంత మాత్రంగానే ప్రారంభమయ్యాయి. ఇటుక తయారీ కూలీల ఖర్చు, ఇటుక కాల్చేందుకు వినియో గించే బొగ్గు, పొట్టు ధరలు కూడా ఇబ్బడిముబ్బడి గా పెరిగాయి. దీంతో గత ఏడాది తీ వ్ర నష్టాలు రావటంతో సుమారు 10 మంది ఇటుక బట్టీల యజమానులు నిల్వ ఉన్న ఇటుకలను అమ్ముకుంటే చాలు అనే ఆలోచనతో ఉన్నారు. మిగిలిన ఇటుక బట్టీల యజమానులు మాత్రం ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్న వ్యాపారాన్ని వదిలి వెళ్ల లేక, వేరే వ్యాపారాలు చేయలేక, మంచి రోజులు రాక పోతాయా అన్న ఆలోచనతో ఇటుక తయారీకి సిద్ధమయ్యారు. గత ఏడాది తయారీ చేసిన ఇటుక లో సుమారు సగ భాగం నిల్వలు ఉండడంతో గత ఏడాది తయారు చేసిన దానిలో సగం మాత్రమే తయారీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండు, మూడు సంవత్సరాలలో ఇటుక బట్టీలు మరింత తగ్గే అవకాశం ఉందని ఇటుక బట్టీల యజమానులు వాపోతున్నారు.

Updated Date - Dec 03 , 2025 | 01:21 AM