Share News

నేడు పల్స్‌పోలియో

ABN , Publish Date - Dec 21 , 2025 | 02:09 AM

జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో జరగ నుంది. అందుకు అవసరమైన ఏర్పాట్లను వైద్యశాఖ పూర్తి చేసింది. చుక్కల మందుపై ప్రజలకు అవ గాహన కల్పిస్తూ జిల్లాకేంద్రంతోపాటు పీహెచ్‌సీల పరిధిలో శనివారం ర్యాలీలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.

నేడు పల్స్‌పోలియో
ఒంగోలులో పల్స్‌పోలియో ర్యాలీని ప్రారంభిస్తున్న డీఆర్వో ఓబులేశు

ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీలు

ఒంగోలులో ప్రారంభించిన డీఆర్వో

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో జరగ నుంది. అందుకు అవసరమైన ఏర్పాట్లను వైద్యశాఖ పూర్తి చేసింది. చుక్కల మందుపై ప్రజలకు అవ గాహన కల్పిస్తూ జిల్లాకేంద్రంతోపాటు పీహెచ్‌సీల పరిధిలో శనివారం ర్యాలీలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలులో ర్యాలీని డీఆర్వో చినఓబు లేశు ప్రారంభించారు. కలెక్టరేట్‌ వద్ద నుంచి నెల్లూరు బస్టాండు వరకూ ప్రదర్శన సాగింది. నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో ఓబులేశు మాట్లాడుతూ జిల్లాలో 2.42లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తామన్నారు. మొదటి రోజు జిల్లాలోని అన్ని వైద్యశాలలతోపాటు బస్టాండ్లు, ముఖ్య కూడళ్లు, రైల్వేస్టేషన్ల వద్ద ఏర్పాటుచేసిన కేంద్రాల్లో తమ పిల్లలకు చుక్కలు వేయించుకోవాలన్నారు. సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి మిగిలిపోయిన చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని పేర్కొన్నారు. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు వైద్యాధికారులు, నర్సింగ్‌ విద్యార్థులు తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 02:09 AM