నేడు అన్నదాత సుఖీభవ
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:42 PM
పధాన మంత్రి కిసాన్ స్కీం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని మార్కెట్‌యార్డు ఆవరణలో ఈనెల 19 బుధవారం నిర్వహిస్తున్నారు. మంగళవారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి నివాసం వ్యవసాయాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి చేతుల మీదుగా
నగదు జమ కార్యక్రమం
గిద్దలూరు టౌన్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : పధాన మంత్రి కిసాన్ స్కీం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని మార్కెట్‌యార్డు ఆవరణలో ఈనెల 19 బుధవారం నిర్వహిస్తున్నారు. మంగళవారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి నివాసం వ్యవసాయాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో 2వ విడత అన్నదాత సుఖీభవ పథకం కింద 37,649 మంది రైతులకు ఒక్కొక్కరికీ రూ.5వేల చొప్పున మొత్తం రూ.18.82కోట్ల నగదు రై తుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. అలాగే ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా 32,762 మంది రైతులకు రూ.2వేల చొప్పున 6.55 కోట్లు జమ కానున్నది. ఎమ్మెల్యే చేతులమీదుగా జరిగే ఈ కార్యక్రమానికి రైతులు భారీగా హాజరు కానున్నారని వ్యవసాయ సహాయ సంచాలకులు రాజశ్రీ తెలిపారు.
5,402 మంది రైతులకు ప్రయోజనం
ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి
రాచర్ల : అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 5402మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని నియోజకవర్గ ప్రత్యేక అధికారి, మార్కాపురం ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆయన అన్నదాత సుఖీభవ సంబంధించిన వివరాలను ఆయన తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నారని అందులో భాగంగా నియోజక వర్గ స్థాయిలో రైతు సేవా కేంద్రం వద్ద ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో అన్నదాత సుఖీభవ సంబంధించి 5402మంది రైతులు అన్నదాత సుఖీభవకు ఎంపికయ్యారని అందుకు సంబంధించి రైతులకు రూ.3.72కోట్లు నిధులు మంజూరైనట్లు తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్‌ను తహసీల్దార్ ఎల్.వెంకటేశ్వర్లు, కార్యాలయ సిబ్బంది సన్మానించారు.
నేడు గురిజేపల్లిలో
ఎర్రగొండపాలెం రూరల్ : రైతులకు అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం ద్వారా అందించే కార్యక్రమాన్ని బుధవారం మండలంలోని గురిజేపల్లి గ్రామంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పాల్గొంటారని మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి మంగళవారం తెలిపారు. టీడీపీ నాయకులు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొనాలని కోరారు.
అర్హులైన ప్రతి రైతుకు పీఎం కిసాన్ నగదును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బుధవారం జమ చేస్తున్నట్లు వ్యవసాయాధికారిని కే నీరజ తెలిపారు. మంగళవారం మండలంలోని వాదంపల్లి, అమానిగుడిపాడు గ్రామాలలో రైతు సేవా కేంద్రాలలో రైతులతో సమావేశం నిర్వహించారు. మండలంలో 8,519 మంది అర్హులు కాగా రూ.5.71కోట్లు నిధులు జమకానున్నట్లు తెలిపారు. రబీలో సాగు చేసిన పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. పంటలను పరిశీలించి రైతులకు అవసరమైన పలు సలహాలు, సూచనలు అందించారు. ఆర్‌సీకే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కందుల ఆధ్వర్యంలో
తర్లుపాడు : అన్నదాత సుఖీభవన నిధులు బుధవారం విడుదల చేస్తున్నట్లు వ్యవసాయ అధికారి జ్యోష్నాదేవి తెలిపారు. సచివాలయ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. నియోజవర్గ రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.